Homeగాసిప్స్టక్ జగదీష్ గొడవ: థమన్ స్థానంలో గోపి సుందర్ వచ్చాడా?

టక్ జగదీష్ గొడవ: థమన్ స్థానంలో గోపి సుందర్ వచ్చాడా?

టక్ జగదీష్ గొడవ: థమన్ స్థానంలో గోపి సుందర్ వచ్చాడా?
టక్ జగదీష్ గొడవ: థమన్ స్థానంలో గోపి సుందర్ వచ్చాడా?

దర్శకుడు శివ నిర్వాణ మొదటి రెండు చిత్రాలతోనే దర్శకుడిగా తన ప్రత్యేకతను నిరూపించుకున్నాడు. ఈ రెండు చిత్రాలు నిన్ను కోరి, మజిలీ చిత్రాలకు గోపి సుందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. అయితే మజిలీ సినిమాకు గోపి సుందర్ కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించడం కుదరకపోవడంతో థమన్ చేత ఆ పని చేయించుకున్నాడు శివ నిర్వాణ.

తన పని తీరు నచ్చడంతో నానితో చేస్తోన్న టక్ జగదీష్ కు థమన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా ఎన్నుకున్నాడు. అయితే ఇప్పుడు థమన్ కు శివ నిర్వాణకు క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని, ఇద్దరూ మాట్లాడుకునే పరిస్థితిలో లేరని సమాచారం. దీంతో ఇక చేసేది లేక టక్ జగదీష్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను థమన్ కాకుండా గోపి సుందర్ తో చేయించుకున్నాడట శివ నిర్వాణ.

- Advertisement -

ఈ సినిమా ఫైనల్ కాపీ ఈ మధ్యనే రెడీ అయింది. మొదట ఓటిటికి వస్తుందని అనుకున్నా కానీ చివరికి థియేటర్లకు మొగ్గు చూపారు నిర్మాతలు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All