
2015 నుంచి హీరో గోపీచంద్‌కు ఒక్క హిట్టు లేదు. ఇప్పటి వరకు వరుసగా ఏడు ఫ్లాపుల్ని సొంతం చేసుకున్నారు. గత కొంత కాలంగా హిట్టు కోసం శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్న ఆయన ఈ సారి ఎలాగైనా సూపర్‌హిట్‌ని దక్కించుకోవాలనుకుంటున్నారు. అందు కోసం సంపత్నందినసంపత్ నందిని నమ్ముకున్నారు. గోపీచంద్, సంపత్‌నందిల కలయికలో ఓ మాస్ మాసాలా ఎంటర్‌టైనర్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి `సీటీమార్` అనే టైటిల్‌ని ఫైనల్ చేసేశారు.
శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్ టైటిల్ పోస్టర్‌ని చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. హైదరాబాద్, రాజమండ్రిలో కీలక షెడ్యూల్‌ని పూర్తి చేశారు. ఈ రోజు (సోమవారం) నుంచి ఆర్ఎఫ్‌సీలో తాజా షెడ్యూల్‌ని ప్రారంభించారు. నాన్ స్టాప్‌గా షూటింగ్ చేసి చిత్రాన్ని సమ్మర్‌లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
గోపీచంద్ తన గత చిత్రాలని దృష్టిలో పెట్టుకుని ఏ విషయంలోనూ రాజీపడటం లేదంట. ఎలాగైనా ఈ సారి భారీ విజయాన్ని సొంతం చేసుకుని మళ్లీ ట్రాక్‌లోని రావాలని భావిస్తున్నారట. అందుకే ఈ చిత్రాన్ని మేకర్స్ కూడా ఏ విషయంలోనూ రాజీపడటం లేదు. గోపీచంద్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తరుణ్ అరోరా విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. తమన్నా, దిగాంగన సూర్యవన్షీ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.