Homeటాప్ స్టోరీస్‘గోల్ మాల్ 2020’ రివ్యూ

‘గోల్ మాల్ 2020’ రివ్యూ

‘గోల్ మాల్ 2020’ రివ్యూ
‘గోల్ మాల్ 2020’ రివ్యూ

మిట్టకంటి రామ్, విజయ్ శంకర్ , అక్షత, మహి మల్హోత్రా,కిస్లే చౌదరీ ప్రధాన పాత్రల్లో నూతన దర్శకుడు జాన్ జిక్కి తెరకెక్కించిన చిత్రం గోల్ మాల్ 2020 . కె.కె.చైతన్య సమర్పణ లో బాబీ ఫిలిమ్స్ ప్రొడక్షన్ లో ఈ మూవీ నిర్మించబడింది. ఈ మూవీ లోని పలు పాటలు ఆసక్తి గా ఉండడం తో సినిమా ఫై అందరిలో ఆసక్తి పెరిగింది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ కథ ఏంటి..? ఎవరు ఎలా నటించారు..? ప్రేక్షకులు ఏమంటున్నారనేది చూద్దాం.

కథ :
పల్లెటూరి వాతావరణంలో సాగే కథ ఇది. రఘు అనే పల్లెటూరి వ్యక్తి ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అతని స్నేహితుడు వృద్ధురాలితో సంబంధాన్ని కోరుకుంటాడు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్‌ జరిగింది. ఒక ఎమ్మెల్యే, రఘుతో పాటు అతని కుటుంబ సభ్యులు ఆకస్మికంగా అదృశ్యమయ్యారు. అసలు వీరిని ఎవరు కిడ్నాప్ చేసారు..? ఎందుకు కిడ్నాప్ చేస్తారు..? అనేది తెలియక గ్రామస్థులు షాక్ లో ఉంటారు..? మరి వారిని ఎవరు కిడ్నాప్ చేశారనేది తెలియాలంటే..మీరు గోల్‌మాల్ 2020 చూడాల్సిందే.

- Advertisement -

ప్లస్ :
* టైటిల్ కు తగ్గ కథ
* ప్రస్తుత కాలానికి తగిన స్టోరీ
* నటీనటుల యాక్టింగ్

మైనస్ :
* కామెడీ
* పాత్రల తీరు

ఫైనల్ :
ప్రస్తుత జీవిత పరిస్థితులకు సంబంధించిన కథకు గోల్‌మాల్ 2020 టైటిల్ సరిగ్గా సరిపోతుంది. అయితే సినిమాలోని పాత్రలు నాస్టాల్జిక్‌గా అనిపించాయి. సినిమాని ఆస్వాదించడానికి కామెడీ విభాగం చాలా బలహీనంగా ఉంది.  సినిమాలోని కొన్ని భాగాలు ప్రేక్షకులను కొంత కలవరానికి గురిచేశాయి. ఈ నేపధ్యంలో ఏదో గోల్మాల్ జరుగుతోందని రుజువైంది.

రేటింగ్: 2.75/5

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All