
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ లో గద్దర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. చిరంజీవి – మోహన్ రాజా కలయికలో గాడ్ ఫాదర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది మలయాళ చిత్రం ‘లూసిఫర్’కు ఇది రీమేక్. ఈ సినిమా షూటింగ్ చక చకా జరగుతోంది. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందబోయే ఈ చిత్రాన్ని చిరంజీవి ఇమేజ్‌కు, తెలుగు నెటివిటీకి తగినట్లు మార్చి తెరకెక్కిస్తున్నారు. ఈ తరుణంలో ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆయన తాలూకా సన్నివేశాలను ముంబై లో పూర్తీ చేసారు.
చిరంజీవి, సల్మాన్ ఖాన్‌పై తెరకెక్కిస్తున్న సన్నివేశాలు చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయని చిత్రయూనిట్ చెబుతోంది. తెలుగులో సల్మాన్‌ఖాన్ నటించడం ప్రత్యేకత సంతరించుకుంది. ఇలా మెగాస్టార్ చిరంజీవి, సల్మాన్ ఖాన్‌లు ఇద్దరూ ఒకేచోట కనిపించడం అభిమానులకు పండుగే. సోమవారంతో `గాడ్ ఫాదర్` ముంబై షెడ్యూల్ పూర్తయింది. తదుపరి షెడ్యూల్ త్వరలో తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలిపారు. కొణిదెల సురేఖ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.