Homeగాసిప్స్చిరు మలయాళ రీమేక్ కు క్లాసిక్ టైటిల్

చిరు మలయాళ రీమేక్ కు క్లాసిక్ టైటిల్

చిరు మలయాళ రీమేక్ కు క్లాసిక్ టైటిల్
చిరు మలయాళ రీమేక్ కు క్లాసిక్ టైటిల్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. త్వరలోనే గుమ్మడికాయ కొట్టేస్తారు. ఎక్కువ బ్రేక్ తీసుకోకుండా చిరంజీవి తన నెక్స్ట్ సినిమాను సెట్ చేస్తున్నాడు. మలయాళంలో సూపర్ హిట్ సాధించిన లూసిఫెర్ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు.

ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకుడిగా ఎంపికైన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. సెప్టెంబర్ నుండి షూటింగ్ మొదలయ్యే అవకాశముంది. ఇదిలా ఉంటే ఈ చిత్ర టైటిల్ విషయంలో ఇప్పటికే పలు రూమర్లు ప్రచారంలో ఉన్నాయి.

- Advertisement -

లూసిఫెర్ టైటిల్ ను అయితే దీనికి పెట్టరు. అలాగే పెద్దాయన, కింగ్ మేకర్ వంటి టైటిల్స్ ప్రచారంలోకి వచ్చినా తాజా సమాచారం ప్రకారం గాడ్ ఫాదర్ టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ది గాడ్ ఫాదర్ అని క్లాసికల్ సినిమా. గ్యాంగ్స్టర్ జోనర్ లో అదొక బైబిల్ వంటిది. అలాంటి క్లాసిక్ టైటిల్ ను చిరు సినిమాకు పెడుతుండడం విశేషమే మరి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All