
బంగార్రాజు మూవీ తో సూపర్ హిట్ అందుకున్న కింగ్ నాగార్జున…ప్రస్తుతం ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్లో ఘోస్ట్ అనే మూవీ చేస్తున్నాడు. గరుడవేగ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన సినిమా కావడంతో ఘోస్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ప్రవీణ్ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నాడు. రీసెంట్ గా దుబాయ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. మండు ఎండలో నాగార్జున బైక్ ఫై రైడ్ చేస్తున్న సన్నివేశాలను డైరెక్టర్ చిత్రీకరించారు. అలాగే సోనాల్ చౌహన్ , నాగార్జున లఫై ఓ పాట ను చిత్రీకరించారు.
ఈ వారం నుంచే హైదరాబాద్‌లో క్లయిమాక్స్ సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు. నాగార్జున, విదేశీ ఫైటర్లపై చిత్రీకరించనున్న ఆ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా ఓ సెట్‌ని తీర్చిదిద్దుతున్నారు. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ కథలో నాయకానాయికలిద్దరూ ఇంటర్‌పోల్ అధికారుల పాత్రల్లో కనిపించనున్నారు. గుల్‌పనాగ్, అనిఖా సురేంద్రన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.