HomeVideosగని టీజర్: ఆట ఆడినా ఓడినా రికార్డ్స్ లో, గెలిస్తే మాత్రమే చరిత్రలో!!

గని టీజర్: ఆట ఆడినా ఓడినా రికార్డ్స్ లో, గెలిస్తే మాత్రమే చరిత్రలో!!

గని టీజర్: ఆట ఆడినా ఓడినా రికార్డ్స్ లో, గెలిస్తే మాత్రమే చరిత్రలో!!
గని టీజర్: ఆట ఆడినా ఓడినా రికార్డ్స్ లో, గెలిస్తే మాత్రమే చరిత్రలో!!

మెగా హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ డ్రామా గని విడుదలకు సిద్ధమవుతోంది. స్పోర్ట్స్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్ర షూటింగ్ ను పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేసారు. ఈరోజు గని టీజర్ విడుదలైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ టీజర్ కు వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం.

“ప్రతీ ఒక్కడి కథలో కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి, కోరికలు ఉంటాయి, కోపాలు ఉంటాయి. కలబడితే గొడవలు ఉంటాయి. అలాగే ఇక్కడున్న ప్రతీ ఒక్కడికి ఛాంపియన్ అయిపోవాలన్న ఆశ ఉంటుంది. కానీ విజేతగా నిలిచేది ఒక్కడే. ఆ ఒక్కడూ నువ్వే ఎందుకు అవ్వాలి. why you? ఆట ఆడినా ఓడినా రికార్డ్స్ లో ఉంటావు, కానీ గెలిస్తే మాత్రమే చరిత్రలో ఉంటావు.” అని రామ్ చరణ్ చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి.

- Advertisement -

బాక్సింగ్ నేపధ్యాన్ని చూపిస్తూనే టీజర్ లో ప్రముఖ పాత్రలను కూడా పరిచయం చేసారు. సాయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా నదియా, జగపతి బాబు, నరేష్, నవీన్ చంద్ర, ఉపేంద్ర, సునీల్ శెట్టి కీలక పాత్రలు పోషించారు. ఎస్ ఎస్ థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరింది.

డిసెంబర్ 24న గని విడుదలవుతున్నట్లు అధికారికంగా టీజర్ ద్వారా ప్రకటించారు.  కిరణ్ కొర్రపాటి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

ఇవి కూడా చదవండి:
‘అఖండ’తో శ్రీకాంత్ కు కొత్త లైఫ్ వస్తుందా?
అఖండ ట్రైలర్: మాస్ కు ఫుల్ మీల్స్
గని ప్రపంచంలో ఉన్నది వీరే!
చిన్న గని గా మెప్పిస్తోన్న అల్లు అయాన్

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All