Homeటాప్ స్టోరీస్ఈరోజు JRC కన్వెన్షన్ లో గని రిలీజ్ పంచ్ ఈవెంట్

ఈరోజు JRC కన్వెన్షన్ లో గని రిలీజ్ పంచ్ ఈవెంట్

Ghani Release Punch On April 6th
Ghani Release Punch On April 6th

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గని మూవీ ఏప్రిల్ 08 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలో చిత్ర ప్రమోషన్లను రకరకాల పేర్లతో చేస్తూ సినిమా ఫై ఆసక్తి పెంచుతున్నారు. రీసెంట్ గా ఏప్రిల్ 02 న వైజాగ్ లో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గానిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ మెగా ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజరై సినిమా కు బజ్ తీసుకొచ్చాడు.

ఇక ఈరోజు ఫిలిం నగర్ లోని JRC కన్వెన్షన్ లో రిలీజ్ పంచ్ ఈవెంట్ ను చేయబోతున్నారు. ఈ ఈవెంట్ కు చిత్ర యూనిట్ అంత హాజరు కాబోతున్నట్లు తెలుస్తుంది. కిరణ్‌ కొర్రపాటి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని అల్లు బాబీ నిర్మించారు. జగపతిబాబు, సునీల్‌ శెట్టి, ఉపేంద్ర, నవీన్‌చంద్ర ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి తమన్‌ మ్యూజిక్ అందించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All