
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గని మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని అల్లు బాబీ నిర్మించగా, జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్‌చంద్ర ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించారు. రోటీన్ స్పోర్ట్స్ డ్రామగా ప్రేక్షకులు తేల్చేసారు. కాగా ఇప్పుడు ఈ మూవీ ఓటిటి లో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్దమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సాధారణంగా ఏ సినిమా అయినా రిలీజ్ అయిన 4-5 వారాల తర్వాత డిజిటల్ లోకి వస్తుంది. కానీ కొన్ని సినిమాలు మాత్రం రెండు నుంచి మూడు వారాలలోపే ఓటిటీ లో దర్శనమిస్తుంటాయి.ఈ క్రమంలో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన పుష్ప సినిమా నెల రోజుల్లోనే ఓటీటీ లోకి వచ్చేసింది.రాదే శ్యామ్ కూడా రెండు వారాల్లోనే డిజిటల్ లో సందడి చేసింది.ఇప్పుడు గని సినిమా కూడా రిలీజ్ అయిన మూడు వారాలకు అంటే ఏప్రిల్ 29 నుంచి “ఆహ” లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన రానున్నట్లు సమాచారం.