Homeన్యూస్డిసెంబర్ రిలీజ్ ప్లాన్ చేస్తోన్న గని

డిసెంబర్ రిలీజ్ ప్లాన్ చేస్తోన్న గని

డిసెంబర్ రిలీజ్ ప్లాన్ చేస్తోన్న గని
డిసెంబర్ రిలీజ్ ప్లాన్ చేస్తోన్న గని

యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం తన కెరీర్ పరంగా సంతృప్తిగానే ఉన్నాడు. వరస విజయాలతో కెరీర్ గ్రాఫ్ పైకి వెళ్తోంది. ప్రస్తుతం వరుణ్ రెండు సినిమాలను సిద్ధం చేస్తున్నాడు. అందులో ఒకటి వెంకటేష్ తో అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తోన్న ఎఫ్3 కాగా మరొకటి గని.

బాక్సింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇటీవలే షూటింగ్ కూడా పూర్తయింది. అయితే ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారు అన్నదానిపై క్లారిటీ లేదు. మొదట జులై విడుదల అనుకున్నా కరోనా సెకండ్ వేవ్ కారణంగా సాధ్యపడలేదు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాల్లో బిజీగా ఉంది. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం డిసెంబర్ లో గనిని విడుదల చేయాలని భావిస్తున్నారు.

- Advertisement -

డిసెంబర్ 3న ఈ చిత్రం విడుదల కావొచ్చని అంటున్నారు. గని ద్వారా కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సిద్ధు ముద్ద, అల్లు బాబీలు గని చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర, నదియా వంటి వారు ప్రముఖ పాత్రలు పోషించారు. సాయీ మంజ్రేకర్ హీరోయిన్ గా ఈ చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవుతోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All