Saturday, October 1, 2022
Homeటాప్ స్టోరీస్`జార్జిరెడ్డి` ప్రొడ్యూస‌ర్‌తో బిగ్‌బాస్ ఫేమ్ సోహైల్ మూవీ!

`జార్జిరెడ్డి` ప్రొడ్యూస‌ర్‌తో బిగ్‌బాస్ ఫేమ్ సోహైల్ మూవీ!

`జార్జిరెడ్డి` ప్రొడ్యూస‌ర్‌తో బిగ్‌బాస్ ఫేమ్ సోహైల్ మూవీ!
`జార్జిరెడ్డి` ప్రొడ్యూస‌ర్‌తో బిగ్‌బాస్ ఫేమ్ సోహైల్ మూవీ!

బిగ్ బాస్ తో బుల్లితెర నటుడు సోహెల్ కు భారీ ప్రజాదరణ ల‌భించింది. ట్రోఫీ రేసులో టాప్ త్రీలో నిలిచిన సోహైల్ చివ‌రికి నాగార్జున ఇచ్చిన ఆఫ‌ర్‌తో 25 ల‌క్ష‌లు తీసుకుని పోటీ నుంచి త‌ప్పుకున్న విష‌యం తెలిసిందే. హౌస్‌లో త‌నదైన మార్కు గేమ్ స్టాట‌జీని ప్ర‌ద‌ర్శించి ప‌లువురి మ‌న్న‌న‌లు అందుకున్న‌సోహైల్ హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు.

- Advertisement -

త‌న మొదటి చిత్రానికి సంతకం చేశారు. ఈ చిత్రాన్ని ‘జార్జ్ రెడ్డి’ , ‘ప్రెజర్ కుక్కర్’ వంటి విభిన్న‌మైన చిత్రాల్ని అందించిన‌న అప్పీ రెడ్డి నిర్మిస్తారు. ఈ చిత్రం ద్వారా సోహైల్ మిత్రుడు శ్రీ‌నివాస్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కాబోతున్నారు. ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం గురువారం సోహైల్ హీరోగా సినిమా చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించింది.

ఇదొక‌ ఎమోషనల్ మెలోడ్రామా అని భార‌తీయ తెర‌పై ఇంత వ‌ర‌కు ఈ త‌ర‌హా క‌థ రాలేద‌ని, త్వ‌ర‌లోనే ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేయ‌బోతున్నామ‌ని, దీంతో ఈ మూవీ ఏ స్థాయిలో వుండ‌నుంద‌న్న‌ద‌ని స్ప‌ష్ట‌మ‌వుతుంద‌ని ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస్ తెలిపారు. బిగ్‌బాస్ త‌న ప‌దేళ్ల క‌ష్టాన్ని మ‌రిపించింద‌ని, త‌న‌కు ఓ గుర్తింపుని తీసుకొచ్చింద‌ని, ఇప్ప‌టి నుంచి క‌థ వేరే వుంట‌ద‌ని సోహైల్ తెలిపారు.

కొత్త క‌థ‌తో చేస్తున్న సినిమా ఇద‌ని, సోహైల్ బిగ్‌బాస్ లోకి వెళ్ల‌డానిక ముందు నుంచే త‌మ‌కు తెలుసున‌ని, త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాల్ని వెల్ల‌డిస్తామ‌ని నిర్మాత అప్పిరెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts