Homeటాప్ స్టోరీస్జార్జ్ రెడ్డి మూవీ రివ్యూ

జార్జ్ రెడ్డి మూవీ రివ్యూ

జార్జ్ రెడ్డి మూవీ రివ్యూ
జార్జ్ రెడ్డి మూవీ రివ్యూ

దర్శకుడు: జీవన్ రెడ్డి
నిర్మాత: అప్పి రెడ్డి, సంజయ్ రెడ్డి, దాము రెడ్డి, సుధాకర్ రెడ్డి యక్కంటి
బ్యానర్: మైక్ మూవీస్, త్రి లైన్ సినిమాస్, సిల్లీ మొంక్స్ స్టూడియోస్
మ్యూజిక్: సురేష్ బొబ్బిలి
నటీనటులు: సందీప్ మాధవ్, దేవిక, సంజయ్ రెడ్డి, మనోజ్ నందం, సత్యదేవ్
విడుదల తేదీ: నవంబర్ 22, 2019

తెలుగులో బయోపిక్ ల కాలం నడుస్తోంది. ఇప్పటికే ఎంతో మంది స్ఫూర్తిమంతమైన వ్యక్తుల బయోపిక్ లు మనం చూసాం. లేటెస్ట్ గా ఈ కోవలోకి చెందే సినిమా జార్జ్ రెడ్డి. స్టూడెంట్ గా ఉంటూనే ఒక జనరేషన్ ను ఇన్స్పైర్ చేసిన గొప్ప స్టూడెంట్ నాయకుడి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా.

- Advertisement -

కథ:
జార్జ్ రెడ్డి (సందీప్ మాధవ్) 1970లో ఉస్మానియా యూనివర్సిటీలో ఫిజిక్స్ గ్రూప్ లో జాయిన్ అవుతాడు. స్వతహాగా చదువులో జెమ్ అయిన జార్జ్ రెడ్డి ఆ యూనివర్సిటీలో వేళ్ళూనుకునిపోయి ఉన్న కుల, మత, డబ్బు వ్యత్యాసాలపై పోరాటం మొదలుపెడతాడు. అక్కడ అప్పటికే చక్రం తిప్పుతున్న స్టూడెంట్ గ్రూప్స్ పై తిరుగుబాటు జెండా ఎగురవేస్తాడు. జార్జ్ రెడ్డి సినిమా ఎలా అతను ఒక నాయకుడిగా ఎదిగాడు, ఎందుకని ఇప్పటికీ అతని గురించి మాట్లాడుకుంటున్నాం, అంతలా అతను ఏం చేసాడు, తదితర విషయాలను ప్రస్తావిస్తుంది.

నటీనటులు:
జార్జ్ రెడ్డిగా సందీప్ ఆ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. స్వతహాగా మంచి నటుడైన సందీప్, జార్జ్ రెడ్డి మ్యానరిజమ్స్ ను, బాడీ లాంగ్వేజ్ ను చక్కగా ఒడిసిపట్టుకున్నాడు. ఎక్కడా ఓవర్ అనిపించకుండా చక్కగా ఎమోషన్స్ ను పలికించగలిగాడు. ఇతర పాత్రల్లో సత్యదేవ్, చైతన్య కృష్ణ బాగా నటించారు. హీరోయిన్ కూడా పర్వాలేదు. ఇతర పాత్రల్లో ఎక్కువగా కొత్త ముఖాలే కనిపించాయి. అందరూ తమ పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:
సాంకేతికంగా జార్జ్ రెడ్డి ఉన్నతంగా తెరకెక్కింది. సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం పర్వాలేదనిపించేలా ఉన్నా కానీ అతని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్టాండ్ అవుట్ గా నిలుస్తుంది. సుధాకర్ యక్కంటి సినిమాటోగ్రఫీ సూపర్బ్ గా ఉంది. సినిమా మూడ్ ను చక్కగా రిప్రెసెంట్ చేయగలిగింది సినిమాటోగ్రఫీ. ఫైట్ సీక్వెన్స్ లలో వాడిన షాట్స్ అయితే సూపర్బ్. యాక్షన్ సీన్లను బాగా హ్యాండిల్ చేసారు. ముఖ్యంగా ఫైర్ బాల్ ఫైట్, బెల్ట్ ఫైట్ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయిస్తాయి. ఎడిటింగ్ లో కన్సిస్టెన్సీ లేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకత్వం చాలా ఫ్లాట్ గా ఉంది. రెండు, మూడు ఎపిసోడ్స్ తప్పితే మిగతావి ఫ్లాట్ నరేషన్ ఇచ్చాడు.

చివరిగా:
ఒక జనరేషన్ మొత్తాన్ని చాలా తక్కువ కాలంలో ఇన్స్పైర్ చేసిన వ్యక్తి జార్జ్ రెడ్డి. స్టూడెంట్ నాయకుడిగా ఎదిగే క్రమంలో దానికే బలైపోయాడు. ఇప్పటికీ అతని గురించి మాట్లాడుకుంటున్నామంటే అది అతని వ్యక్తిత్వం యొక్క గొప్పతనమే. అయితే ఈ సినిమాలో దాన్ని ఎఫెక్టీవ్ గా చూపించడంలో విఫలమయ్యారు. సెకండ్ హాఫ్ మొత్తం సాగతీసిన ఫీల్ కలుగుతుంది. నరేషన్ లో కన్సిస్టెన్సీ లేకపోవడం పెద్ద మైనస్. ఎడిటింగ్ ఇంకా బాగుండాల్సింది. చాలా చోట్ల సాగతీసిన ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్ పెద్ద లెట్ డౌన్ గా మిగిలింది. మొత్తంగా చూసుకుంటే జార్జ్ రెడ్డి సరైన ఎమోషన్స్ ను తట్టడంలో విఫలమైంది. ఫైర్ బాల్ ఫైట్, బెల్ట్ ఫైట్, టెరిఫిక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, నటీనటుల పెర్ఫార్మన్స్ గురించి ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు. మిగతా అంతా బోరింగ్ వ్యవహారమే.

రేటింగ్: 2/5

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All