
చెలి, కాక కాక, సూర్య సన్నాఫ్ కృష్ణన్, ఏమాయ చేసావె వంటి రొమాంటికల్ లవ్‌స్టోరీస్‌తో దర్శకుడిగా తనదైన ముద్రవేసుకున్నారు గౌతమ్ మీనన్. గత కొంత కాలంగా తన జోరు తగ్గించిన ఆయన తాజాగా విలన్ అవతారం ఎత్తారు. ఆయన నటించిన మలయాళ చిత్రం `కన్నుమ్ కన్నుమ్ కోలైయాదితాల్`. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించారు. `పెళ్లి చూపులు` ఫేమ్ రీతూ వర్మ కథానాయికగా నటించింది. దేసింగ్ పెరియసామి దర్శకుడు. ఈ చిత్రాన్ని తెలుగులో `కనులు కనులను దోచాయంటే` పేరుతో రిలీజ్ చేస్తున్నారు.
బుధవారం రిలీజ్ చేసిన ఈ చిత్ర ట్రైలర్ ఆకట్టుకుంటోంది. `నో మోర్ షార్ట్ కట్స్..న్యూ లైఫ్ న్యూ బిగినింగ్స్.. అంటూ దుల్కర్ వాయిస్‌తో ట్రైలర్ మొదలైంది. ఇందులో దర్శకుడు గౌతమ్ మీనన్ విలన్‌గా నటించారు. `ఇండియా అన్ లైన్ ట్రేడ్ కి వర్త్ ఎంతో తెలుసా? రెండు లక్షల కోట్లు. సుమారు పది కోట్ల మంది అన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నారు. మనం వెతికే వాడు ఆ పది కోట్లల్లో ఒక్కడు` అంటూ గౌతమ్ మీనన్ చెబుతున్న డైలాగ్‌లు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
`అర్జున్‌రెడ్డి` చిత్రానికి నేపథ్య సంగీతాన్ని అందించిన హర్శవర్థన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. సరికొత్త నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం మలయాళంలో ఇప్పటికే రిలీజై బవచి విజయాన్ని సాధించింది. తెలుగులో ఈ నెల 28న రిలీజ్ చేస్తున్నారు.