Homeటాప్ స్టోరీస్`గ‌తం` ద‌ర్శ‌కుడితో డా. రాజ‌శేఖ‌ర్ 92వ చిత్రం!

`గ‌తం` ద‌ర్శ‌కుడితో డా. రాజ‌శేఖ‌ర్ 92వ చిత్రం!

`గ‌తం` ద‌ర్శ‌కుడితో డా. రాజ‌శేఖ‌ర్ 92వ చిత్రం!
`గ‌తం` ద‌ర్శ‌కుడితో డా. రాజ‌శేఖ‌ర్ 92వ చిత్రం!

యాంగ్రీ యంగ్‌మెన్ డా. రాజ‌శేఖ‌ర్ హీరోగా మ‌రో చిత్రం ప్రారంభః కాబోతోంది. ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా త‌న 91 వ చిత్రంగా `శేఖ‌ర్‌` మూవీని ప్ర‌క‌టించి ప్రారంభించిన విష‌యం తెలిసిందే. తాజాగా శ‌నివారం 92వ చిత్రాన్ని ప్ర‌క‌టించారు. `గ‌తం` ఫేమ్ కిర‌ణ్ కొండమ‌డుగుల ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఈ చిత్రాన్ని శివాని, శివాత్మిక‌, భార్గ‌వ పోలుదాసు, సృజ‌న్ ఎర్ర‌బోలు సంయుక్తంగా నిర్మించ‌నున్నారు.

ఈ మూవీ కాన్సెప్ట్ థీమ్ పోస్ట‌ర్‌ని శ‌నివారం చిత్ర బృందం విడుద‌ల చేసింది. రాజ‌శేఖ‌ర్ న‌టిస్తున్న `శేఖ‌ర్‌` చిత్రం పూర్తి కాగానే ఆగ‌స్టులో ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు కిర‌ణ్ మాట్లాడుతూ `గ‌తం` త‌రువాత నేను చేయ‌నున్న చిత్ర‌మిది. ఇదొక యాక్ష‌న్ థ్రిల్ల‌ర్. యాంటీ సోష‌ల్ ఎలిమెంట్ సెక్స్ ట్రాఫికింగ్ నేప‌థ్యంలో ఈ మూవీ వుంటుంది. చిత్రీక‌ర‌ణ మొత్తం ఆమెరికా నేప‌థ్యంలో సాగ‌నుంది. హీరో క్యారెక్ట‌ర్ చాలా ఇంటెన్స్‌తో వుంటుంది. రాజ‌శేఖ‌ర్‌కిది టైల‌ర్‌మేడ్ క్యారెక్ట‌ర్ అనుకోవ‌చ్చు` అన్నారు.

- Advertisement -

`గ‌తం` చిత్రంలోని అర్జున్ పాత్ర‌లో న‌టించాను. ఆ చిత్రానికి ఓ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించాను. మా త‌దుప‌రి చిత్రాన్ని డా. రాజ‌శేఖ‌ర్‌తో చేయ‌బోతుండ‌టం ఆనందంగా వుంది. కిర‌ణ్ రాసిన ఈ క‌థ రాజ‌శేఖ‌ర్‌కి ప‌ర్‌ఫెక్ట్‌. ఈ మూవీ విష‌యంలో చాలా ఎగ్జైటింగ్‌గా వున్నాం` అని ఓ నిర్మాత భార్గ‌వ్ పోలుదాసు తెలిపారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All