Homeటాప్ స్టోరీస్తెరపైకి పవన్ విడాకుల అంశం ..

తెరపైకి పవన్ విడాకుల అంశం ..

పవన్ కళ్యాణ్ ఏంటి..విడాకులు ఏంటి..? మరోసారి పవన్ ఏమైనా విడాకులు తీసుకుంటున్నాడా..? అని ఆశ్చర్య పోకండి. మీము చెప్పేది వ్యక్తిగతం గురించి కాదు రాజకీయ అంశం గురించి. వ్యక్తిగతంగా ఎంతో పేరు , ప్రతిష్టలు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ ..రాజకీయాల్లో మాత్రం అంతగా గుర్తింపు తెచ్చుకోలేదు. జనసేన పేరుతో పార్టీ స్థాపించి..ముందుగా తెలుగుదేశం – బిజెపి పార్టీ లకు సపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసినప్పటికీ తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో కూడా గెలువలేకపోయాడు. ప్రస్తుతం 2024 ఎన్నికల్లో విజయం సాధించి తీరుతామని చెప్పుకుంటూ తిరుగుతున్నారు.

- Advertisement -

కాగా మొన్నటి వరకు బిజెపి పార్టీ కి సపోర్ట్ గా నిలిచినా పవన్..ఈ మధ్య ఆ పార్టీ కి దూరంగా ఉంటూ వస్తున్నాడు. బిజెపి శ్రేణులు సైతం పవన్ కళ్యాణ్ ను పట్టించుకోవడం లేదు. దీనికి ఉదాహరణే భీమ్లా నాయక్ టికెట్స్ వ్యవహారం. పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ మూవీ రీసెంట్ గా విడుదలై చక్కటి విజయం సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా రిలీజ్ సందర్భంలో ఏపీ సర్కార్ తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. బెనిఫిట్ షోస్ , అదనపు షోస్ కు అనుమతి ఇవ్వకపోగా, టికెట్ ధరలు కూడా పంచుకునే అవకాశం లేకుండా చేసింది. దీంతో జనసేన కార్య కర్తలు , అభిమానులే కాదు తెలుగుదేశం పార్టీ నేతలు సైతం పవన్ కు సపోర్ట్ గా మాట్లాడి…జగన్ సర్కార్ ఫై విమర్శలు చేశారు. కానీ ఏపీలో జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ మాత్రం నోరు తెరవలేదు. భీమ్లా నాయక్ సినిమాని తొక్కేస్తున్నారు అనే కామన్ డైలాగ్ కూడా అటునుంచి వినిపించలేదు. దీనిని బట్టి చూస్తే బీజేపీ, జనసేన విడిపోవడం ఖాయమనే చెప్పాలి. అందుకే ఇప్పటినుండే పవన్ ను బిజెపి దూరం పెడుతుందని అంత మాట్లాడుకుంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All