
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గని మూవీ ఏప్రిల్ 08 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలో చిత్ర ప్రమోషన్లను తెగ చేస్తున్నారు.. రీసెంట్ గా ఏప్రిల్ 02 న వైజాగ్ లో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గానిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ మెగా ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజరై సినిమా కు బజ్ తీసుకొచ్చాడు. ఇక ఈరోజు చిత్ర మేకింగ్ వీడియో ను రిలీజ్ చేసి ఆసక్తి నింపారు.
ఈ మేకింగ్ వీడియో లో వరుణ్ బాక్సింగ్ సన్నివేశాలు, డాన్స్, ఇతర సన్నివేశాలు చిత్రీకరించే దృశ్యాలను చూపించారు. బన్ని కూడా ఈ వీడియోలో కనిపించారు. కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని అల్లు బాబీ నిర్మించారు. జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్‌చంద్ర ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించారు.
