
`గౌరవంతో బతకాలి.. ఎవ్వడికీ భయపడకూడదు.. పోలీసుకైనా, మంత్రికైనా. ఎమ్మెల్యేకైనా .. అంటోంది అలియాభట్. ఆమె నటిస్తున్న తాజా చిత్రం `గంగూబాయి కతియావాడీ`. కమాటీపురా మాఫియా క్వీన్ గంగుబాయి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సంజయ్ లీలాభన్సాలీ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ మూవీలో టైటిల్ పాత్రని అలియాభట్ పోషిస్తోంది.
హిందీలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర హిందీ వెర్షన్ టీజర్ విడుదలైంది. తాజాగా తెలుగు వెర్షన్‌కి సంబంధించిన టీజర్‌ని విడుదల చేశారు. ఈ రోజు పవర్‌స్టార్ `వకీల్‌సాబ్` విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా `వకీల్‌సాబ్` థియేటర్లలో ఈ మూవీ తెలుగు టీజర్‌ని విడుదల చేశారు. ఆద్యంతం ఆసక్తికర సన్నివేశాలు, అలియా డైలాగ్స్‌తో ఆకట్టుకుంటోంది.
`కామాటిపురలో అమావాస్య రాత్రి కూడా అంధకారంలో ఉండదు. ఎందుకంటే అక్కడ గంగూ వుంటుంది` అనే డైలాగ్‌తో టీజర్ మొదలైంది. `గంగూ చంద్రిక చంద్రికలానే వుంటుంది. .. నేలమీద కూనకచొని భలేగా కనిపిస్తున్నావ్ నువ్వు. అలవాటు చేసుకో ఎందుకంటే కుర్చీపోయిందిగా` అంటూ అలియాభట్ చెబుతున్న డైలాగ్‌లు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. జూలై 30న ఈ మూవీ హిందీతో పాటు తెలుగులోనూ విడుదల కానుంది.
One Name. Million Emotions♥️
Bringing to you a story of the woman who rose to power, #GangubaiKathiawadi.
Telugu teaser out now!
In cinemas on 30th July.https://t.co/Xu4VAKSoxE#SanjayLeelaBhansali @ajaydevgn @prerna982 @jayantilalgada @PenMovies @bhansali_produc— Alia Bhatt (@aliaa08) April 9, 2021
