
సంగీతం : అనిరుధ్
నిర్మాత : జ్ఞానవేల్ రాజా
డైరెక్షన్ : విగ్నేష్ శివన్
రేటింగ్ : 3 / 5
రిలీజ్ డేట్ : 12 జనవరి 2018
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ” గ్యాంగ్ ” . కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో మాజీ హీరో కార్తీక్ , రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు . జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రానికి విగ్నేష్ శివన్ దర్శకత్వమ్ వహించాడు . ఈరోజు రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .
కథ :
ఉత్తమ్ దాస్ ( సూర్య ) తన చదువుకి తగ్గ ఉద్యోగం రాకపోవడంతో కొంతమంది మిత్రులతో కలిసి గ్యాంగ్ గా ఏర్పడి సిబిఐ అధికారులమని చెప్పుకుంటూ దోపిడీలకు పాల్పడుతుంటాడు . ఈ దోపిడీ లు ఎక్కువ కావడంతో ఈ గ్యాంగ్ ఆగడాలను అరికట్టడానికి పూనుకుంటారు అసలు సిబిఐ అధికారులు . అయితే అవినీతి అడుగడుగునా రాజ్యమేలుతున్న ఈ దేశంలో మమ్మల్ని ఎవరూ పట్టుకోలేరని ఛాలెంజ్ విసరడమే కాకుండా సిబిఐ అధికారులను ముప్పుతిప్పలు పెడతాడు ఉత్తమ్ దాస్ . అసలు ఉత్తమ్ దాస్ సిబిఐ అధికారిగా ఎందుకు దోపిడీ లకు పాల్పడుతున్నాడు ? దానికి కారణం ఏంటి ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .
హైలెట్స్ :
సూర్య నటన
రమ్యకృష్ణ
ఫస్టాఫ్
డ్రా బ్యాక్స్ ;
సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు
నటీనటుల ప్రతిభ :
తమిళ స్టార్ హీరో సూర్య కు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే . దాంతో ఇన్నాళ్లకు తెలుగులో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు . డబ్బింగ్ సొంతంగా చెప్పుకున్నప్పటికీ ఎక్కడా తడబాటు లేకుండా చూసుకొని అందరి చేత భేష్ అనిపించుకున్నాడు . రమ్యకృష్ణ – సూర్య ల కాంబినేషన్ లో వచ్చిన సీన్స్ బాగానే పేలాయి . రమ్యకృష్ణ ఏ పాత్ర చేస్తే అందులో ఒదిగిపోయే తత్వం ఉన్న నటి అందుకే అమాయక యువతి పాత్రలో బాగా చేసింది . హాస్య నటుడు సుధాకర్ చాలాకాలం తర్వాత నటించిన చిత్రం ఇది అయితే అతడికి అంతగా ప్రాధాన్యత లేకపోవడం గమనార్హం . ఆర్ జె బాలాజీ నవ్వులు పూయించారు , కార్తీక్ సిబిఐ ఆఫీసర్ పాత్రలో మెప్పించాడు .
సాంకేతిక వర్గం :
బాలీవుడ్ చిత్రాన్ని స్వల్ప మార్పులు చేసి బాగానే హ్యాండిల్ చేసాడు దర్శకుడు విగ్నేష్ శివన్ . దేశంలో ఉన్న పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించాడు అయితే సీరియస్ అంశాన్ని ఇంకాస్త డీటైల్డ్ గా చూపించి ఉంటే ఖచ్చితంగా ఇంకా పెద్ద హిట్ అయ్యుండేది కానీ ఆ దిశలో ఆలోచన చేయలేదు ఎందుకో ! స్టూడియో గ్రీన్ నిర్మాణ విలువలు బాగున్నాయి . అనిరుద్ నేపథ్య సంగీతం బాగుంది ……. ఛాయాగ్రహణం ఈ సినిమాకు మరో హైలెట్ గా నిలిచింది .
ఓవరాల్ గా :
ప్రేక్షకులను ఆలోచింప జేసే కథాంశంతో వచ్చిన ఈ గ్యాంగ్ ……. మంచి సందేశాత్మక చిత్రం అనడంలో సందేహం లేదు
- Advertisement -