Homeన్యూస్ఇబ్బందుల్లో నాగ శౌర్య.. తన ఫామ్ హౌజ్ లో గ్యాంబ్లింగ్

ఇబ్బందుల్లో నాగ శౌర్య.. తన ఫామ్ హౌజ్ లో గ్యాంబ్లింగ్

ఇబ్బందుల్లో నాగ శౌర్య.. తన ఫామ్ హౌజ్ లో గ్యాంబ్లింగ్
ఇబ్బందుల్లో నాగ శౌర్య.. తన ఫామ్ హౌజ్ లో గ్యాంబ్లింగ్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్యాంబ్లింగ్ పై ఉక్కుపాదం మోపిన సంగతి తెల్సిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ గ్యాంబ్లింగ్, పేకాట క్లబ్స్ లాంటి వాటిని అస్సలు ప్రోత్సహించకూడదని, అటువంటి కార్యకలాపాలపై నిషేధం విధించినా కూడా ఎప్పటికప్పుడు పోలీసుల రైడ్స్ లో గ్యాంబ్లింగ్ జరుగుతున్నట్లు బట్టబయలు అవుతూ వస్తోంది.

నిన్న రాత్రి నటుడు నాగ శౌర్యకు సంబంధించిన ఒక ఫామ్ హౌజ్ పై ముందుగానే సమాచారమందుకున్న మాదాపూర్ SOT పోలీసులు ఆకస్మిక దాడి చేయగా రూ.24 లక్షల నగదు, 33 మొబైల్ ఫోన్లు, 29 పేకాట సెట్లతో, టోకెన్లు, పోకర్ చిప్స్, కాయిన్స్, మూడు కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంచిరేవుల ప్రాంతంలోని గ్రీన్ ల్యాండ్స్ కాలనీలో ఒక ఫామ్ హౌజ్ లో గ్యాంబ్లింగ్ జరుగుతోందని ముందుగానే పోలీసులకు సమాచారం అందింది. దీంతో రైడ్ చేయగా ఆ ఇల్లు నటుడు నాగ శౌర్యది అని తేలింది. అయితే నాగ శౌర్య ఈ ఇంటిని కొనుగోలు చేయలేదు. ఐదేళ్ల కాలానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ నుండి లీజుకి తీసుకున్నారు.

నాగ శౌర్య సన్నిహితుడు గుట్ట సుమన్ కుమార్ ఆధ్వర్యంలో ఆ ఇంట్లో గ్యాంబ్లింగ్ జరుగుతుండగా పోలీసులు రైడ్ చేసారు. అయితే నాగ శౌర్యకు ఈ గ్యాంబ్లింగ్ లో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All