Homeటాప్ స్టోరీస్గల్లా అశోక్ 'హీరో'..ఎన్ని కోట్లు నష్టం తెచ్చిందో తెలుసా..?

గల్లా అశోక్ ‘హీరో’..ఎన్ని కోట్లు నష్టం తెచ్చిందో తెలుసా..?

గల్లా అశోక్ 'హీరో'..ఎన్ని కోట్లు నష్టం తెచ్చిందో తెలుసా..?
గల్లా అశోక్ ‘హీరో’..ఎన్ని కోట్లు నష్టం తెచ్చిందో తెలుసా..?

చిత్రసీమలో వారసుల ఎంట్రీ అనేది కామన్..ఇప్పటివరకు ఎంతోమంది ఇండస్ట్రీ లో హీరోగా అడుగుపెట్టారు. కానీ వారిలో కొంతమంది మాత్రం సక్సెస్ అయ్యి రాణిస్తుండగా..మరికొంతమంది ఒకటి , రెండు సినిమాలకే ఇండస్ట్రీ నుండి దూరమయ్యారు. రీసెంట్ గా సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుండి గల్లా అశోక్ హీరోగా ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చారు. శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా హీరో అనే మూవీ సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ స్టార్ కృష్ణ, గల్లా అరుణకుమారి, సమర్పణలో అమర రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై గల్లా పద్మావతి ఈ సినిమాను నిర్మించారు.

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుండి రావడం , మహేష్ బాబు సపోర్ట్ ఇవ్వడం తో చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది. కానీ సినిమా మాత్రం అంచనాలను అందుకోవడం లో విఫలం అయ్యింది. హీరోగా అశోక్ కు మంచి మార్కులే పడినప్పటికీ , ఆకట్టుకునే కథ , కథనం లేకపోవడం తో సినిమా అనుకున్న స్థాయి లో ఆడలేదు. దీంతో నిర్మాతలకు రూ. 3.34 కోట్ల నష్టాలు తెచ్చిపెట్టింది.

- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు సమాచారం.   బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 6 కోట్లుగా నమోదైంది. కానీ సినిమా టోటల్ రన్‌లో రూ. 2.66 కోట్లు మాత్రమే వసూళ్లు చేయడం తో.. నిర్మాతలకు రూ. 3.34 కోట్ల నష్టాలూ వచ్చాయి. మరి నెక్స్ట్ సినిమా విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటారు కావొచ్చు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All