
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ చిత్రం మొత్తానికి ఫుల్ రన్ కు చేరుకుంది. విడుదలైన రోజు నుండే హిట్ టాక్ అందుకున్న ఈ చిత్రం అంచనాలకు తగ్గట్లుగా రాణించింది. 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి 25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మరో 12 కోట్లు సాటిలైట్, డిజిటల్ రైట్స్ కింద వచ్చాయి. సో, నిర్మాతలకు ఇది ప్రాఫిటబుల్ వెంచర్ అనే చెప్పాలి.
ఇక డిస్ట్రిబ్యూటర్లు కూడా దాదాపు అన్ని చోట్లా ఫుల్ రన్ పూర్తయ్యేసరికి లాభాల్లోకి వచ్చారు. ఒక్క ఓవర్సీస్ లోనే ఈ చిత్రం అంచనాలకు తగ్గట్లు రాణించలేకపోయింది. మొత్తంగా గద్దలకొండ గణేష్ ఫుల్ రన్ కు వచ్చేసరికి 25.15 కోట్ల షేర్, 45 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.
గద్దలకొండ గణేష్ ఫుల్ రన్ కలెక్షన్స్ బ్రేక్ డౌన్ ఇక్కడ చూద్దాం..
ప్రాంతం షేర్ (కోట్లలో)
నైజాం 8.74
సీడెడ్ 3.45
నెల్లూరు 0.89
కృష్ణ 1.42
గుంటూరు 1.83
వైజాగ్ 2.66
ఈస్ట్ 1.61
వెస్ట్ 1.51
మొత్తం 22.11
కర్ణాటక 1.33
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.63
ఓవర్సీస్ 1.08
వరల్డ్ వైడ్ మొత్తం 25.15