
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ చిత్రం మాస్ ఆడియన్స్ కు తెగ నచ్చేస్తోంది. తమిళ్ క్లాసిక్ జిగర్తాండకు తనదైన శైలిలో హరీష్ శంకర్ చేసిన మార్పులకు ఆడియన్స్ ఇంప్రెస్ అయ్యారు. అందుకే తొలి వారాంతం ఈ సినిమా మంచి కలెక్షన్స్ సాధించింది. బాక్స్ ఆఫీస్ సమాచారం ప్రకారం ఈ చిత్రం తొలి వారాంతంలో ఒక్క తెలుగు రాష్ట్రాల నుండే 13.4 కోట్లను వసూలు చేసింది.
దాదాపు 25 కోట్లకు బిజినెస్ జరిగిన ఈ సినిమాకు ఇది మంచి అమౌంట్ అనే చెప్పాలి. ఇక ఈ వారం పేరున్న సినిమాలు ఏం విడుదల కావట్లేదు కాబట్టి సైరా వచ్చేవరకూ ఈ చిత్రానికి ఎదురే లేదు.
- Advertisement -
ఈ రోజు నుండి చిత్రానికి అసలు పరీక్ష మొదలవుతుంది. పనిదినాల్లో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ బట్టి గద్దలకొండ గణేష్ ఏమేరకు హిట్ అవుతుందనేది చూడాలి.
- Advertisement -