
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ చిత్రం తొలి వారాంతం సూపర్ కలెక్షన్స్ తో దూసుకుపోయిన విషయం తెల్సిందే. ఈ కలెక్షన్ ఫ్లోని బట్టి తొలి వారంలోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేసారు. సోమ, మంగళవారాల్లో కూడా ఈ చిత్ర కలెక్షన్స్ స్టడీగా ఉండడంతో నిర్మాతలు, బయ్యర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఇదే ట్రెండ్ బుధవారం కూడా కొనసాగింది.
గద్దలకొండ గణేష్ గా వరుణ్ తేజ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. జిగర్తాండ చిత్రాన్ని మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా హరీష్ శంకర్ మలిచాడు. ఆరు రోజుల గద్దలకొండ గణేష్ కలెక్షన్స్ బ్రేక్ డౌన్ ఇక్కడ చూడండి :
నైజాం – 6.28 కోట్లు
నెల్లూరు – 70 లక్షలు
కృష్ణా – 1.26 కోట్లు
గుంటూరు – 1.47 కోట్లు
వైజాగ్ – 2.05 కోట్లు
తూ.గో జిల్లా – 1.25 కోట్లు
ప.గో జిల్లా – 1.18 కోట్లు
సీడెడ్ – 2.78 కోట్లు
మొత్తం : 16.97
వరల్డ్ వైడ్ గద్దలకొండ గణేష్ ఆరు రోజులకు 30 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి హిట్ అనిపించుకుంది. అక్టోబర్ 2 వరకూ మరో సినిమా పోటీ లేకపోవడంతో మరింతగా వసూళ్లు తెచ్చుకునే అవకాశముంది.