
వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం గద్దలకొండ గణేష్.. అదేనండి పేరు మార్చారుగా. ఈ చిత్రం ఈరోజు బ్రహ్మాండంగా విడుదలవుతోంది. ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్ లు కూడా మొదలైపోయాయి. మొదటి షోల ద్వారా అందిన తాజా సమాచారం ప్రకారం వరుణ్ తేజ్ మరో హిట్ అందుకున్నట్లేనని తెలుస్తోంది. హరీష్ శంకర్ మరోసారి రీమేక్ చేయడంలో విజయవంతమయ్యాడు.
ముఖ్యంగా వరుణ్ తేజ్ పాత్ర మాస్ ఆడియన్స్ కు పూనకాలు తెప్పిస్తోందని అంటున్నారు. హరీష్ శంకర్ మాసీ డైలాగ్స్, వరుణ్ తేజ్ నటన కలిసి ఈ గద్దలకొండ గణేష్ చిత్రాన్ని నిలబెట్టేశాయని, ఇక ఎల్లువొచ్చి గోదారమ్మ పాట సినిమాను పీక్స్ కు తీసుకెళ్లిందని తెలుస్తోంది. అయితే జిగర్తాండ చూసిన వాళ్లకు ఈ చిత్రం మాములుగా అనిపించినా, చూడని వాళ్లకు మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ ను అందిస్తుందని అంటున్నారు. పూర్తి రివ్యూలు వస్తే కానీ అసలు పరిస్థితి ఏంటో తెలియదు.