Homeటాప్ స్టోరీస్యాంక‌ర్ ప్ర‌దీప్ టైమ్ భ‌లే వుందే!

యాంక‌ర్ ప్ర‌దీప్ టైమ్ భ‌లే వుందే!

యాంక‌ర్ ప్ర‌దీప్ టైమ్ భ‌లే వుందే!
యాంక‌ర్ ప్ర‌దీప్ టైమ్ భ‌లే వుందే!

బుల్లితెర‌పై క్రేజీ యాంక‌ర్‌గా పేరు తెచ్చుకున్న ప్ర‌దీప్ `30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా?` అనే చిత్రంతో హీరోగా ప‌రిచ‌యం అవుతున్న విష‌యం తెలిసిందే. రొమాంటిక్ ల‌వ్‌స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్ర‌దీప్ టూ షేడ్స్ వున్న పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. సుకుమార్ వ‌ద్ద ఆర్య‌2, వ‌న్ నేనొక్క‌డినే వంటి చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన మున్నా ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

అమృతా అయ్య‌ర్ హీరోయిన్‌గా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రాన్ని ఎస్వీ బాబు నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన `నీలి నీలి ఆకాశం…`ఇదేం స్నేహం…` అంటూ సాగే గీతాలకు విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. `నీలి నీలి ఆకాశం.. పాట‌కు యూట్యూబ్‌లో 60 ల‌క్ష‌ల పైచిలుకు వ్యూస్ రావ‌డం విశేషం. కొత్త త‌ర‌హా క‌థ‌తో రూపొందుతున్న ఈ చిత్రం ఈ నెల 25న విడుద‌ల కాబోతంది.

- Advertisement -

విభిన్న‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు జీఏ2, యువీ క్రియేష‌న్స్ రిలీజ్ చేయ‌డానికి ముందుకొచ్చాయి. దీంతో ఈ సినిమా జ‌నాల్లోకి వెళ్ల‌డం ఖాయ‌మ‌ని, ప్ర‌దీప్ చేసిన తొలి సినిమాకు క్రేజీ నిర్మాణ సంస్థ‌లు వెన్నుద‌న్నుగా నిల‌వ‌డంతో స‌గం స‌క్సెస్ ఇక్క‌డే ల‌భించింద‌ని, ప్ర‌దీప్ టైమ్ మామూలుగా లేద‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో చెప్పుకుంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All