
అవును ఇప్పుడు పోలీసులు అంటే అలాగే ఉన్నారు. చిన్న చిన్న వాటికి గొడవలు, సెటిల్మెంట్ ఎమన్నా ఉంటే సెటిల్ చేసేస్తారు. పెద్ద సమస్య గా మారిన సమస్యలు అనగా మాధ్యమాల్లో ఎవరన్నా సెలెబ్రెటీస్ ని తిడితే 3 రోజులు పోలీస్ స్టేషన్ లో ఆ సదరు వ్యక్తిని బాగా మందలించి మాట వినకపోతే వారిని కొట్టి బయటికి వదిలేసే పోలీసులు చిన్న చిన్న వాటికి మాత్రం పెద్దగా స్పందిస్తారు. అలాంటి కేసు లు పోలీస్ స్టేషన్ లొ కుప్పలు కుప్పలు గా ఉంటాయి.
విషయానికి వస్తే ఒక వ్యక్తి హైదరాబాద్ లోని ఒక ఏరియా అనగా కూకట్ పల్లి జే.ఎన్.టి.యు దగ్గర ఒక మాల్ దగ్గరికి వెళ్లి ‘చాణక్య‘ సినిమా టిక్కెట్ కొనుక్కొని లోపలికి వెళ్లి కూర్చున్నాడు. సినిమా సాయంత్రం 4:40 నిమిషాలకి అని ఉంది. కానీ సినిమా మొదలు అవ్వకుండా కొన్ని అనవసరపు యాడ్స్ వేసారు. దాని వాళ్ళ సదరు వ్యక్తికి 10 నిమిషాలు ఆలస్యం అయిందని చెప్పి సినిమా మధ్యలోంచి వెళ్ళాడో? లేక సినిమా మొత్తం అయిపోయిన తర్వాత వెళ్ళాడో? తెలీదు కానీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగింది అంత చెప్పి థియేటర్ యాజమాన్యం మీద కేసు పెట్టాడు.
ఇక విషయం తెలుసుకున్న పోలీసులు ఆ వ్యక్తి పెట్టిన కేసు ని సీరియస్ గా తీసుకోవాలా? లేక అతనిని మందలించి పంపించాలా? అని తెలియక ఆ కేసు మీద విచారణ జరుపుతున్నారు. ఆ వ్యక్తికి సినిమా థియేటర్ లో పడే సరైన సమయం దగ్గరనుండి అనవసరపు యాడ్స్ వేసి జనాలని ఇబ్బంది పెడుతున్న అన్ని విషయాలు మాతో చట్ట ప్రకారం గానే సరిగ్గా మాట్లాడారు అని చెప్తున్నారు పోలీసులు.
మరి ఆ వ్యక్తి అలా చట్ట ప్రకారం మాట్లాడారు అంటున్న పోలీసులు….ఇక మీదినుండి థియేటర్ లో యాడ్స్ వేయడం మానిపిస్తారో? లేక ఎటువంటి చర్యలు తీసుకుంటారో? అని ఆ కేసు గురించి బయటికి తెలిసిన జనాలు అనుకుంటున్నారు.