Homeన్యూస్మెగా ట్రీట్: నెల రోజుల్లో నాలుగు మెగా సినిమాల క్లాష్

మెగా ట్రీట్: నెల రోజుల్లో నాలుగు మెగా సినిమాల క్లాష్

మెగా ట్రీట్: నెల రోజుల్లో నాలుగు మెగా సినిమాల క్లాష్
మెగా ట్రీట్: నెల రోజుల్లో నాలుగు మెగా సినిమాల క్లాష్

మెగా అభిమానులకు డిసెంబర్ నుండి జనవరి వరకూ మెగా ట్రీట్ ఉండబోతోంది. నెల రోజుల గ్యాప్ లో ఏకంగా నాలుగు మెగా హీరోల చిత్రాలు విడుదలవుతుండడం నిజంగా వారికి ఆనందాన్ని ఇచ్చే విషయమే. ముందుగా డిసెంబర్ 17న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పుష్ప ది రైజ్ ద్వారా మొదటి సారి అల్లు అర్జున్ మొదటి సారి ప్యాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు. పుష్ప ది రైజ్ తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలవుతోంది. పుష్ప వచ్చిన వారం రోజులకు క్రిస్మస్ హాలిడేను క్యాష్ చేసుకోవడానికి వస్తున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్.

బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో గని చిత్రాన్ని చేసిన విషయం తెల్సిందే. ఈ సినిమా నాని శ్యామ్ సింగ రాయ్ తో డైరెక్ట్ క్లాష్ అవుతోంది. అయినా కూడా క్రిస్మస్ అడ్వాంటేజ్ కారణంగా బరిలోకి దిగుతున్నాడు వరుణ్ తేజ్. ఇక జనవరి 7న అతి పెద్ద చిత్రం విడుదల కానుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం ఆ రోజే ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజమౌళి చిత్రం అంటే ఉండే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు.

- Advertisement -

ఆర్ ఆర్ ఆర్ విడుదలైన ఐదు రోజులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న భీమ్లా నాయక్ సంక్రాంతి బరిలోకి దూకనుంది. ఇలా మొత్తంగా నెల రోజుల గ్యాప్ లో నాలుగు మెగా హీరోల చిత్రాలు బాక్స్ ఆఫీస్ ముందు సందడి చేయనున్నాయి.

ఇవి కూడా చదవండి:

ఆచార్య సాంగ్ ప్రమోషన్స్ మళ్ళీ షురూ!!

RRR నాటు నాటు ఫుల్ సాంగ్.. నటరాజుల నాటు డ్యాన్స్.. తారక్, చరణ్ ఈ ఒక్క పాట చాలు..!

పుష్ప తమిళ్ రైట్స్ ను చేజిక్కించుకున్న లైకా!!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All