Homeటాప్ స్టోరీస్బిగ్‌బాస్‌లో న‌లుగురు హ్యాటీలు!

బిగ్‌బాస్‌లో న‌లుగురు హ్యాటీలు!

బిగ్‌బాస్‌లో న‌లుగురు హ్యాటీలు!
బిగ్‌బాస్‌లో న‌లుగురు హ్యాటీలు!

బిగ్‌‌బాస్ సీజ‌న్ 3 ఎంత పాపుల‌ర్ అయిందో అంద‌రికి తెలిసిందే. రాహుల్ సిప్లిగంజ్‌, పున‌ర్న‌వి భూపాలం ల‌వ్‌స్టోరీతో బిగ్‌బాస్ 3 నిత్యం వార్త‌ల్లో నిలిచింది. రోజూ ఓ సెన్సేష‌న్‌ని క్రి‌యేట్ చేసి నెటిజ‌న్ల‌కు, వీవ‌ర్స్‌కు మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని అందించింది. ఈ సీజ‌న్ త‌రువాత బిగ్‌బాస్ సీజ‌న్ 4 ఎప్పుడెప్పుడు మొద‌ల‌వుతుందా? అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

గ‌డిచిన కొన్ని రోజులుగా బిగ్‌బాస్ సీజ‌న్ 4కు సంబంధించి రోజుకో వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. హైద‌రాబాద్‌లో క‌రోనా స్వైర‌వీహారం చేస్తున్న వేళ డోంట్ కేర్ అంటూనే బిగ్‌బాస్ టీమ్ సీజ‌న్ 4 కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. నాగార్జున‌కు సంబంధించిన అన్న‌పూర్ణ సెవెన్ ఎక‌ర్స్‌లో సీజ‌న్ 4 కోసం భారీగా బిగ్‌బాస్ హౌస్‌ని ఏర్పాటు చేస్తున్నారు. బిగ్ బాస్ నిర్వాహ‌కులు ఈ సీజ‌న్ కోసం ఏకంగా న‌లుగురు హాట్ బ్యూటీల‌ని ఎంపిక చేసిన‌ట్టు తెలిసింది.

- Advertisement -

ఈ హాట్ బ్యూటీస్ మ‌రెవ‌రో కాదు శ్ర‌ద్ధాదాస్‌, యామినీ భాస్క‌ర్‌, ప్రియా వ‌డ్ల‌మాని, హంసా నందిని.. ఈ న‌లుగురిని తాజాగా బిగ్‌బాస్ టీమ్ కంటెస్టెంట్‌లుగా ఎంపిక చేసిన‌ట్టు తెలిసింది. ఇప్ప‌టికే త‌రుణ్‌, మంగ్లీ, బిత్తిరి స‌త్తిల‌ని సీజ‌న్ 4 కోసం సెలెక్ట్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ సీజ‌న్‌లో న‌లుగురు హాట్ బ్యూటీల‌ని ప్ర‌ధాన కంటెస్టెంట్‌లుగా ఎంపిక చేయ‌డంతో బిగ్ బాస్ హీటెక్కే అవ‌కాశాలు ఎక్కువే క‌నిపిస్తున్నాయ‌ని నెటిజ‌న్స్‌, బిగ్ బాస్ ల‌వ‌ర్స్ అంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All