Homeటాప్ స్టోరీస్రాజ్ తరుణ్ సినిమా కూడా ఘోరమే

రాజ్ తరుణ్ సినిమా కూడా ఘోరమే

flop talk to rajtaruns rajugaduఈరోజు మూడు సినిమాలు విడుదల అయ్యాయి . అందులో నాగార్జున హీరోగా నటించిన ” ఆఫీసర్ ” , రాజ్ తరుణ్ హీరోగా నటించిన ” రాజుగాడు ” , అలాగే విశాల్ హీరోగా నటించిన ” అభిమన్యుడు ” చిత్రాలు ఉన్నాయి . అయితే అభిమన్యుడు చిత్రం డబ్బింగ్ కాగా ఆఫీసర్ , రాజుగాడు చిత్రాలు తెలుగు చిత్రాలు . విచిత్రం ఏంటంటే డబ్బింగ్ చిత్రమైన అభిమన్యుడు యునానిమస్ గా హిట్ టాక్ తెచ్చుకోగా ఆఫీసర్ చిత్రం డిజాస్టర్ టాక్ వచ్చేసింది ఇక రాజ్ తరుణ్ సినిమా రాజుగాడు కూడా ఘోర పరాజయం దిశగా దూసుకు పోతోంది .

ఆఫీసర్ చిత్రం పై ముందునుండే అంచనాలు లేవు ఎందుకంటే దర్శకుడు రాంగోపాల్ వర్మ కాబట్టి అందుకు తగ్గట్లుగానే మార్నింగ్ షో పూర్తికాకుముందే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది ఆఫీసర్ చిత్రం . ఇక రాజ్ తరుణ్ చిత్రం పై ఎంతోకొంత అంచనాలు ఉండేవి కానీ ఆ సినిమా కూడా నాగార్జున ఆఫీసర్ చిత్రంతో పోటీపడుతూ ప్లాప్ అయ్యింది . మూడు చిత్రాల్లో విశాల్ అభిమన్యుడు సూపర్ హిట్ హోదా దక్కించు కోనుంది . రాజుగాడు చిత్రాన్ని నిర్మించింది అనిల్ సుంకర . ఈ నిర్మాత తీసిన సినిమాలు ఒకటి అరా తప్ప మిగతా సినిమాలన్నీ డిజాస్టర్ లు , ప్లాప్ లు దాంతో ఆ కోవలోనే చేరిపోయింది రాజుగాడు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All