Homeటాప్ స్టోరీస్డైరెక్టర్ గా విఫలమైన మహేష్ అక్క

డైరెక్టర్ గా విఫలమైన మహేష్ అక్క

flop talk to manjula manasuki nachhindiమహేష్ బాబు అక్క మంజుల దర్శకత్వం వహించిన చిత్రం ” మనసుకి నచ్చింది ” ఈరోజు విడుదల అయ్యింది , అయితే విడుదల కు ముందే ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు దానికి తగ్గట్లుగానే ఈరోజు సినిమా రిలీజ్ అయి ప్లాప్ టాక్ తెచ్చుకుంది . స్లో నెరేషన్ తో ప్రేక్షకులు అసహనానికి గురవుతున్నారు . మంజుల నటిగా , నిర్మాతగా తనని తానూ ప్రూవ్ చేసుకుంది . నటిగా సక్సెస్ అయి జాతీయ స్థాయిలో ప్రతిభ చాటింది అలాగే నిర్మాతగా కూడా సక్సెస్ లు అందుకుంది కానీ డైరెక్టర్ గా మాత్రం విఫలమైంది మంజుల .

సందీప్ కిషన్ హీరోగా నటించగా అమైరా దస్తూర్ హీరోయిన్ గా నటించింది . అయితే ఈ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోకుండా చేసింది మంజుల . ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ని తీయాలని ట్రై చేసింది కానీ పూర్తిగా నిరాశపరిచింది దర్శకురాలిగా . మహేష్ ముందే చెప్పినట్లు మంజుల డైరెక్షన్ చేయడం ఏంటని ? మహేష్ తో పాటు చాలామంది ఆశ్చర్య పోయారు కట్ చేస్తే ఫలితం అలాగే వచ్చింది . అసలే సందీప్ కిషన్ కు చాలాకాలంగా సక్సెస్ లేదు ఇప్పుడు మరో ప్లాప్ వచ్చింది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All