Homeటాప్ స్టోరీస్హీరోగా ప్లాప్ అందుకున్న చిరంజీవి చిన్నల్లుడు

హీరోగా ప్లాప్ అందుకున్న చిరంజీవి చిన్నల్లుడు

flop talk to chiranjeevi son in law kalyan dhev vijethaచిరంజీవి చిన్నల్లుడు హీరోగా నటించిన ” విజేత ” చిత్రం ఈరోజు విడుదల అయ్యింది , ఇక ఈ సినిమా పై అంచనాలు బాగానే ఏర్పడ్డాయి ఎందుకంటే చిరంజీవి అల్లుడు కాబట్టి అయితే ఆ అంచనాలను అందుకోవడంలో విజేత విఫలమయ్యింది . ఇక హీరోగా చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా ఆకట్టుకోలేక పోయాడు . కొన్ని సన్నివేశాల్లో బాగానే నటించినప్పటికీ మరికొన్ని సన్నివేశాల్లో మాత్రం నటనలో తేలిపోయాడు కళ్యాణ్ దేవ్ .

రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ విజేత చిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మించాడు . సెంథిల్ ఫోటోగ్రఫీ బాగుంది అలాగే చక్రవర్తి అందించిన సంగీతం కూడా ఫరవాలేదు దర్శకుడు రాకేష్ కూడా మంచి లైన్ ని ఎంచుకున్నాడు కానీ ఆ కథ ని సరిగ్గా హ్యాండిల్ చేయడంలో , స్క్రీన్ ప్లే ని సమకూర్చుకోవడంలో మాత్రం విఫలమయ్యాడు దాంతో చిరు చిన్నల్లుడు మొదటి సినిమాతో విజేత కాలేకపోయాడు .

- Advertisement -

కళ్యాణ్ దేవ్ సరసన మలయాళ భామ మాళవిక నాయర్ నటించగా కీలక పాత్రలో మురళీశర్మ నటించాడు . తండ్రీ కొడుకుల ఇతివృత్తంతో తీసిన ఈ చిత్రం విజేత కాలేకపోయింది .

English Title: flop talk to chiranjeevi son in law kalyan dhev vijetha

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All