Homeటాప్ స్టోరీస్5 సినిమాలు విడుదల మరి హిట్ అయ్యేది ఎన్నో ?

5 సినిమాలు విడుదల మరి హిట్ అయ్యేది ఎన్నో ?

Five movies released ఈరోజు 5 సినిమాలు విడుదల అయ్యాయి . అందులో రెండు స్ట్రైట్ చిత్రాలు , మరో రెండు డబ్బింగ్ చిత్రాలు అలాగే ఒకటేమో బాలీవుడ్ చిత్రం . అంతరిక్షం , పడిపడి లేచె మనసు చిత్రాలకు పాజిటివ్ టాక్ ఉంది . అయితే ఈ రెండు చిత్రాలు కూడా బీసీ కేంద్రాల్లో అంతగా ప్రభావం చూపించే చిత్రాలు కాకపోవడం గమనార్హం . ఇక బాలీవుడ్ చిత్రం విషయానికి వస్తే ……. షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ” జీరో ” చిత్రం విడుదల అవుతోంది . షారుఖ్ ఖాన్ కు హిట్ లేక పదిహేనేళ్ళు మరి ఈ జీరో చిత్రం షారుఖ్ ని జీరో ని చేస్తుందో ? లేక హీరోని చేస్తుందో కొద్దీ గంటల్లో తెలిసిపోనుంది .

ఇక డబ్బింగ్ చిత్రాల విషయానికి వస్తే …… ధనుష్ హీరోగా నటించిన తమిళ చిత్రాన్ని మారి 2 గా తెలుగులో డబ్ చేసారు . తెలుగులో ధనుష్ కు రఘువరన్ బిటెక్ తర్వాత మంచి మార్కెట్ ఏర్పడింది . మరి ఈ మారి 2 ఏం చేస్తుందో చూడాలి . ఇక మరో డబ్బింగ్ చిత్రం కేజిఎఫ్ . కన్నడ చిత్రం అయిన కేజిఎఫ్ ని తెలుగులో అంతగా ప్రమోట్ చేయలేదు . మరి ఈ సినిమా పరిస్థితి ఏంటో ప్రేక్షకులు తేల్చుతారు .

- Advertisement -

English Title: Five movies released

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All