Homeటాప్ స్టోరీస్జూన్ 1న ఎన్ని రిలీజ్ అవుతున్నాయో తెలుసా

జూన్ 1న ఎన్ని రిలీజ్ అవుతున్నాయో తెలుసా

five movies are ready to fight at boxofficeసకాలంలో విడుదల కానీ చిత్రాలన్నీ ఒకేసారి వస్తుండటంతో చిన్న సినిమా నిర్మాతలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది . ఈనెల 25న అలాగే అంతకుముందే విడుదల కావాల్సిన సినిమాలు వాయిదాపడి జూన్ 1న విడుదల అవుతున్నాయి దాంతో జూన్ 1న రద్దీ ఎక్కువయ్యింది . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 నుండి 7 సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి అయితే ఇప్పటికైతే అయిదు సినిమాలు కన్ఫర్మ్ అయ్యాయి , మిగతా వాటి గురించి పక్కన పెడితే రెడీ గా ఉన్న అయిదు సినిమాలు ఇలా ఉన్నాయి .

నందమూరి కళ్యాణ్ రామ్ – తమన్నా నటించిన ” నా నువ్వే ” , విశాల్ – సమంత జంటగా నటించిన ” అభిమన్యుడు ”, కింగ్ నాగార్జున రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ” ఆఫీసర్ ” , రాజ్ తరుణ్ – అమైరా దస్తూర్ జంటగా నటించిన ” రాజుగాడు ” చిత్రాలతో పాటుగా కొత్త దర్శకుడు నరసింహారావు తెరకెక్కించిన ” శరభ ” విడుదలకు సిద్ధంగా ఉన్నాయి . అయితే ఒకేసారి అయిదు సినిమాలు పోటీ పడటం వల్ల అన్ని సినిమాలకు థియేటర్ లు దొరకవు దాంతో ఒకటి రెండు సినిమాలు మళ్ళీ పోస్ట్ పోన్ అయినా ఆశ్చర్యం లేదు . మరి ఈ అయిదు సినిమాలలో ఏవి విడుదల అవుతాయో ? ఏవి పోస్ట్ పోన్ అవుతాయో చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All