Homeటాప్ స్టోరీస్కేజీఎఫ్ 2 లో భయంకరమైన విలన్ గా సంజయ్ దత్

కేజీఎఫ్ 2 లో భయంకరమైన విలన్ గా సంజయ్ దత్

Sanjay Dutt Look
Sanjay Dutt Look

గత ఏడాది విడుదలైన కేజీఎఫ్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే . కాగా ఆ చిత్రానికి కొనసాగింపుగా తెరకెక్కుతున్న కేజీఎఫ్ 2 లో భయంకరమైన విలన్ గా బాలీవుడ్ దిగ్గజం సంజయ్ దత్ నటించనున్నాడు . ఈరోజు సంజయ్ దత్ పుట్టినరోజు కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని సంజయ్ లుక్ ని రివీల్ చేసారు . ఆ లుక్ లో సంజయ్ దత్ అరివీర భయంకరంగా ఉన్నాడు .

కేజీఎఫ్ చిత్రం ఒక్క కన్నడనాట మాత్రమే హిట్ కాలేదు తెలుగు , హిందీ బాషలలో సైతం సంచలనం సృష్టించింది దాంతో కేజీఎఫ్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి . కన్నడ హీరో యష్ కేజీఎఫ్ తో ఒక్కసారిగా సూపర్ స్టార్ అయ్యాడు . యష్ కు బలమైన ప్రత్యర్థి ఉండాలని భావించిన దర్శకులు ప్రశాంత్ నీల్ సంజయ్ ని ఎంపిక చేసారు . ఇక ఈ పార్ట్ 2 ఈ ఏడాది ఆఖరున విడుదల కానుంది .

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All