Homeఎక్స్ క్లూసివ్అల్లు శిరీష్ "ఏబీసీడీ" ఫస్ట్ లుక్ కి సూపర్బ్ రెస్పాన్స్

అల్లు శిరీష్ “ఏబీసీడీ” ఫస్ట్ లుక్ కి సూపర్బ్ రెస్పాన్స్

First look of Allu Sirish’s "ABCD " Unveiled
Allu Sirish

కంటెంట్ వున్న‌ క‌థ‌ల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటున్న అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఏబీసీడీ.

సంజీవ్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టును మధుర ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై మధుర శ్రీధర్ రెడ్డి, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌కి స‌మ‌ర్ప‌కులు గా వ్య‌వ‌హ‌రించిన డి సురేష్ బాబు ఈ చిత్ర స‌మ‌ర్ప‌కులు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ ఫస్ట్ లుక్ కి అద్భుతమైన స్పందన లభించింది. సోషల్ మీడియా లో హల్చల్ చేస్తోంది. మెగా బ్రదర్ నాగబాబు అల్లు శిరీష్ తండ్రి పాత్రలో నటిస్తున్నారు బాల నటుడు భరత్ ఈ చిత్రంలో  ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది.  ధీరజ్ మొగిలినేని కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తుండడంతో ఈ సినిమాకు భారీ క్రేజ్ నెలకొంది. 2.5 కోట్లకు గోల్డ్ మైన్ ఫిల్మ్స్ హిందీ డిజిటల్, శాటిలైట్ హక్కులు సొంతం చేసుకోవడం విశేషం. అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ ఎక్వైరీస్ హ్యూజ్ గా రావటం ఈ చిత్రం క్రేజ్ ని తెలియ‌జేస్తుంది.
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ… మలయాళంలో సూపర్ సక్సెస్ అందుకున్న ఎబిసిడి చిత్రాన్ని తెలుగులో అల్లు శిరీష్ తో నిర్మిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మలయాళంలో దుల్కర్ పోషించిన పాత్రను తెలుగులో శిరీష్ పోషిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. చాలా కాంప్లిమెంట్స్ వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మెగా బ్రదర్ నాగబాబు గారు కీలక పాత్రలో నటిస్తున్నారు. మాస్టర్ భరత్ అల్లు శిరీష్ స్నేహితుడిగా నటిస్తున్నాడు. తెలుగు ప్రేక్షకులంతా హ్యాపీగా ఎంజాయ్ చేసే కథ కావడంతో రీమేక్ చేస్తున్నాం. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అల్లు శిరీష్ సరసన కృష్ణార్జున యుద్ధం ఫేం రుక్సార్ థిల్లాన్ ను హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండడం విశేషం. దర్శకుడు సంజీవ్ రెడ్డి తెలుగు ప్రేక్షకులు మెచ్చే విధంగా కథను తీర్చిదిద్దారు. ప్ర‌ముఖ నిర్మాత డి సురేష్ బాబు ఈ చిత్రాన్ని స‌మ‌ర్పించటం చాలా ఆనందంగా వుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసే చిత్రమిది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అని అన్నారు
నటీనటులు
అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్, నాగబాబు, భరత్
సాంకేతిక వర్గం
స‌మ‌ర్ప‌కులు.. డి.సురేష్ బాబు
మ్యూజిక్ డైరెక్టర్ – జుధా సాంధీ
కో ప్రొడ్యూసర్ – ధీరజ్ మొగిలినేని
బ్యానర్స్ – మధుర ఎంటర్ టైన్ మెంట్, బిగ్ బెన్ సినిమాస్
నిర్మాతలు – మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని

దర్శకుడు – సంజీవ్ రెడ్డి

- Advertisement -

English Title: First look of Allu Sirish’s  “ABCD ” Unveiled

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All