Homeటాప్ స్టోరీస్కానిస్టేబుల్ మ‌ర‌ణంతో పోలీస్ శాఖ‌‌లో క‌ల‌వ‌రం!

కానిస్టేబుల్ మ‌ర‌ణంతో పోలీస్ శాఖ‌‌లో క‌ల‌వ‌రం!

కానిస్టేబుల్ మ‌ర‌ణంతో పోలీస్ శాఖ‌‌లో క‌ల‌వ‌రం!
కానిస్టేబుల్ మ‌ర‌ణంతో పోలీస్ శాఖ‌‌లో క‌ల‌వ‌రం!

క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లుతున్న వేళ ముందుండి స‌హాయ‌క చ‌ర్చ‌ల్లో పాల్గొంటున్న వారు డాక్ట‌ర్స్‌, పారిశుధ్య కార్మికులు, పోలీసులు. ఈ మూడు శాఖ‌లు గ‌త కొన్ని రోజులుగా క‌రోనాని ఎదుర్కొంటూ సామాన్య జ‌నానికి ర‌క్ష‌ణ‌గా నిలుస్తున్నారు. అలాంటి వాళ్ల‌లో పోలీస్ శాఖ అన్నింటా తానై నిలుస్తోంది. వారికి ఇప్పుడు క‌రోనా పాక‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ముంబైలోని ప‌సోలీస్ సిబ్బందికి ఇప్ప‌టికే వెయ్యికి పైగా క‌రోనా పాజిటివ్ రావ‌డం దేశ వ్యాప్తంగా భ‌యాందోళ‌న‌కు గురిచేస్తోంది.

తాజాగా తెలంగాణ‌లో క‌రోనా బారిన ప‌డి ఓ కానిస్టేబుల్ మృతి చెంద‌డంతో పోలీస్ శాఖ అప్ర‌మ‌త్త‌మైంది. రాష్ట్రంలో క‌రోనా క‌ల‌క‌లం మొద‌లైన ద‌గ్గ‌రి నుంచి పోలీసు శాఖ అలుపెర‌గ‌ని కృషి చేస్తోంది. లాక్‌డౌన్‌ని ప‌టిష్టంగా అమ‌లు చేయ‌డంతో పాటు క‌రోనా బాదితుల్ని గాంధీ ఆసుప‌త్రికి త‌ర‌లించ‌డంలోనూ పోలీసులు ముందుంటున్నారు. అయ‌మితే క్షేత్ర స్థాయిలో పోలీసులు క‌రోనా బారిన ప‌డ‌కుండా ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. మాస్కులు, శానిటైజ‌ర్లు అందిస్తూ నిత్యం ప‌ర్య‌వేక్షిస్తున్నారు. అయినా క్షేత్ర స్థాయి పోలీసుల్లో ఆరుగురికి క‌రోనా సోకింది. వీరిలో వ‌న‌స్థ‌లీపురంకు చెందిన ద‌యాక‌ర్‌రెడ్డి (37) అనే కానిస్టేబుల్ బుధ‌వానం రాత్రి గాంధీ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెంద‌డం క‌ల‌వ‌ర‌పెడుతోంది.

- Advertisement -

న‌గ‌రంలో విధులు నిర్వ‌హిస్తున్న కానిస్టేబుల్ ద‌యాక‌ర్‌రెడ్డి ఆరు రోజుల క్రితం జ్వ‌రం రావ‌డంతో ఓ ప్రైట్ ఆసుప‌త్రిని ఆశ్ర‌యించాడ‌ట‌. విష‌యం తెలిసి అత‌న్ని గాంధీ ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా చికిత్స పొందుతూ బుధ‌వారం రాత్రి మృతిచెంద‌డంతో తెలంగాణ పోలీస్ శాఖ‌లో తొలి మ‌ర‌ణం సంభ‌వించింది. దీంతో పోలీస్ శాఖ అప్ప‌మ‌త్త‌మైన‌ట్టు తెలుస్తోంది. తెలంగాణ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 1661 మంది క‌రోనా బారిన ప‌డ్డారు. 40 మంది మృత్యువాత ప‌డ్డారు. 1013 మంది కోలుకుని ఇంటికి చేరుకున్నారు. తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో తెలంగాణ‌లో క‌రోనా బారిన ప‌డిన వారి సంఖ్య 2000కు చేరుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All