Homeటాప్ స్టోరీస్సింగర్ సునీతకు నిశ్చితార్థం జ‌రిగింది!

సింగర్ సునీతకు నిశ్చితార్థం జ‌రిగింది!

సింగర్ సునీతకు నిశ్చితార్థం జ‌రిగింది!
సింగర్ సునీతకు నిశ్చితార్థం జ‌రిగింది!

ప్లేబ్యాక్ సింగర్ సునీత మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచారు. ఆమె మ‌ళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారంటూ గ‌త కొన్ని రోజులుగా వ‌రుస క‌థ‌నాలు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఆమె మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచారు. త‌న పెళ్లి వార్త‌ల‌పై సునీత గ‌తంలో క్లారిటీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయినా స‌రే ఆమె పెళ్లిపై వ‌రుస క‌థ‌నాలు ప్ర‌చారం అవుతూనే వున్నాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం సునీత‌కు మ‌ళ్లీ పెళ్లి నిశ్చ‌యం అయింద‌ని తెలిసింది.

సోమ‌వారం కుటుంబ స‌భ్యుల స‌మక్షంలో సునీత‌కు నిశ్చితార్థం జ‌రిగిన‌ట్టు తెలిసింది. సునీతా మీడియా హౌస్ ఛైర్మన్ ని పెళ్లి చేసుకోబోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. త్వ‌ర‌లోనే వెడ్డింగ్ డేట్‌ని, సునీత త‌ను వివాహం చేసుకోనున్న వ్య‌క్తికి సంబంధించిన వివ‌రాల్ని వెల్ల‌డించే అవ‌కాశం వుంద‌ని చెబుతున్నారు.

- Advertisement -

అంతకుముందు సునీతకు టీవీ ప్రొడ్యూస‌ర్ కిర‌ణ్‌తో వివాహం జ‌రిగింది. ఇద్ద‌రు పిల్ల‌లు పుట్టాక ఇద్ద‌రి మ‌ధ్య విభేధాలు త‌లెత్తాయి. దీంతో ఇద్ద‌రు విడాకులు తీసుకుని సెప‌రేట్‌గా వుంటున్నారు. గ‌త కొంత కాలంగా సునీత వివాహం చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తోందంటూ వ‌రుస క‌థ‌నాలు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. అందులో ఎలాంటి నిజం లేద‌ని ఆ వార్త‌ల్ని ఎప్ప‌టిక‌ప్పుడు సునీత కొట్టిపారేస్తూ వ‌చ్చింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All