
`సైరా నరసింహారెడ్డి` చిత్రం తరువాత వెంటనే మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. దసరాకు లాంఛనంగా మొదలైన ఈ చిత్రం ఏకధాటిగా చిత్రీకరణ జరపుకుంటోంది. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇందులో మెగాస్టార్ చిరంజీవి ఎండోమెంట్ అధికారిగా కనిపిస్తాడని ప్రచారం జరిగింది. కానీ ఇటీవల లీకైన ఫొటోలని బట్టి చూస్తే నక్సలైట్ నాయకుడిగా కనిపిస్తాడని తాజా సమాచారం. నక్సల్ ఉద్యమం నేపథ్యంలో ఈ సినిమా వుంటుందని ఇండస్ట్రీ టాక్. ఈ చిత్రంలోని ఓ కీలక పాత్రలో రామ్‌చరణ్ నటిస్తాడని, లేదు మహేష్ నటిస్తాడని గత కొన్ని రోజులగా వార్తలు షికారు చేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం రామ్‌చరణ్ ఈ సినిమాలో నటించడం లేదని మహేష్ మాత్రమే నటిస్తున్నారని తెలిసింది.
30నిమిషాల నిడివిగల ఈ పాత్రని ముందు రామ్‌చరణ్ చేత చేయించాలనుకున్నారు. కానీ `ఆర్ ఆర్ ఆర్` కారణంగా ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారట. ఆ తరువాత ఆ పాత్రని మహేష్ చేస్తాడని ఓ న్యూస్ బయటికి వచ్చింది. మళ్లీ రామ్‌చరణే చేయబోతున్నాడని ప్రచారం జరిగింది. చివరికి మహేష్ ఈ పాత్రని చేయబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. త్వరలోనే మహేష్ షూటింగ్‌లో పాల్గొంటారట.