
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసుని సీబీఐ క్లోజ్ చేస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సుశాంత్ అనుమానాస్పద మృతి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషషయం తెలిసిందే. నెపోటిజమ్ కారణంగా సుశాంత్ మృతి చెందాడని బాలీవుడ్‌పై నెటిజన్స్ దుమ్మెత్తిపోశారు. అతని మృతి వెనక పెద్ద కుట్ర జరిగిందని, ఈ కేసుని సీబీఐకి అప్పగించాలని డిమాండ్ మొదలవ్వడంతో కేంద్రం ఈ కేసుని సీబీఐకి బదిలీ చేసింది.
ముంబై పోలీసుల నుంచి కేంద్రం అనుమతితో టేకప్ చేసిన సీబీఐ పలువురిని ప్రశ్నించింది. కీలక ఆధారాలు రాబట్టిన సీబీఐ సుశాంత్ మృతి కేసులో ఎలాంటి కుట్ర కోణం లేదని, డిప్రెషన్‌కు గురై ఆత్మహత్యకు పూనుకున్నాడే కానీ అతన్ని ఎవరూ హత్య చేయలేదని తేల్చినట్టు తెలిసింది. త్వరలోనే ఈ కేసుని క్లోజ్ చేసి ఫైనల్ రిపోర్ట్‌ని సీబీఐ బీహార్ కోర్టుకి సమర్పించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14న అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ తరువాత నుంచి ఈ కేసు అనూహ్య మలుపులు తిరుగుతూ వస్తోంది. ఆ తరువాత ఈ కేసులో రియా ప్రధాన ముద్దాయి అంటూ ప్రచారం మొదలైంది. ఆమెకు డ్రగ్ పెడ్లర్‌లతో రియాకు సంబంధాలు వున్నాయని బయటపడటంతో సుశాంత్ మృతి కేసు కాస్త డ్రగ్స్ కేసుగా మారింది. ఎయిమ్స్ బృందం సుశాంత్ ది ఆత్మ హత్యేనని తేల్చడంతో మరింత ఉత్కంఠమొదలైంది. చివనరికి సీబీఐ ఈ కేసుని ఓ
ఆధారణ ఆత్మహత్యగా పేర్కొంటూ క్లోజ్ చేయబోతుండటం పలువురిని షాక్ కు గురిచేస్తోంది.