Monday, August 15, 2022
Homeటాప్ స్టోరీస్హ‌మ్మ‌య్య మొత్తానికి బ‌య‌ట‌ప‌డ్డాం!

హ‌మ్మ‌య్య మొత్తానికి బ‌య‌ట‌ప‌డ్డాం!

హ‌మ్మ‌య్య మొత్తానికి బ‌య‌ట‌ప‌డ్డాం!
హ‌మ్మ‌య్య మొత్తానికి బ‌య‌ట‌ప‌డ్డాం!

దేశ వ్యాప్తంగా క‌రోనా విళ‌య‌తాండ‌వం చేస్తోంది. అయితే ముంబైలో మాత్రం వ‌ణుకు పుట్టిస్తోంది. వేల సంఖ్య‌లో పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్‌లో అదీ పేరున్న సెల‌బ్రిటీల ఇళ్ల‌ల్లో ప‌నివాళ్ల‌కు క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతుండ‌టంతో బాలీవుడ్ వ‌ర్గాలు భ‌యంతో వ‌ణికిపోతున్నారు.  ఇటీవ‌ల క‌ర‌ణ్‌జోహ‌ర్బోనీక‌పూర్‌ ఇంట్లో ప‌ని వాళ్ల‌కి క‌రోనా సోక‌డంతో మ‌రింత భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

- Advertisement -

దీంతో బోనీక‌పూర్ ఆయ‌న ఇద్ద‌రు కుమార్తెలు  జాన్వీక‌పూర్‌, ఖుషీ క‌పూర్ స్వీయ నిర్భందంలోకి వెళ్లిపోయారు. 14 రోజులు ముగియ‌డంతో నేడు బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా బోనీక‌పూర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. `మా ఫ్యామిలీ, నేను డాక్ట‌ర్ల‌కు, పోలీసులు స‌హాయ స‌హ‌కారాల‌తో కోలుకున్నాం. మాలాగే మిగ‌తా వారు కూడా త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం` అన్నారు.

15 రోజుల క్రితం బోనీ క‌పూర్ ఇంట్లో ప‌నిచేస్తున్న ముగ్గురికి టెస్టుల్లో క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో భ‌యాందోళ‌న‌కు గురైన బోనీ క‌రోనా టెస్టులు చేయించుకుని 14 రోజుల పాటు స్వీయ నిర్భంధంలోకి వెళ్లిపోయారు. ఈ స‌మ‌యంలో త‌మ కుటుంబం కోసం ప్రార్థించిన ప్ర‌తీ ఒక్క‌రిక ధ‌న్యవాదాలు తెలియ‌జేశారు.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts