Homeటాప్ స్టోరీస్జెమిని గణేశన్ కూతుర్ల మధ్య ఫైట్

జెమిని గణేశన్ కూతుర్ల మధ్య ఫైట్

fighting between gemini ganesan daughters మహానటి చిత్రంతో ఎన్ని ప్రశంసలు వస్తున్నాయో ఆ స్థాయిలో కాకున్నా విమర్శలు కూడా చాలానే వస్తున్నాయి . ముఖ్యంగా జెమిని గణేశన్ కూతుర్ల మధ్య ఫైట్ అయ్యేలా కనిపిస్తోంది మహానటి చిత్రం వల్ల . మహానటి చిత్రంలో సావిత్రి ని గొప్ప మనసున్న నటిగా చూపించారు బాగుంది కానీ ఆమె మద్యానికి బానిస అయ్యేలా చేసింది జెమిని గణేశన్ అని అలాగే ఆమె అర్దాంతరంగా చావడానికి జెమిని గణేశన్ కారణమని చూపించారని జెమిని గణేశన్ కూతుర్లు ( సావిత్రి పిల్లలు కాకుండా ) భావిస్తున్నారు అంతేకాదు సావిత్రి ఎంత మంచిదో అంత కంటే మొండిదని అంటోంది జెమిని మొదటి భార్య కూతురు కమలా సెల్వరాజ్ .

దాంతో సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి జోక్యం చేసుకుంది . మా అమ్మకు మద్యం అలవాటు చేసింది మా నాన్న జెమిని గణేశన్ కాదని అంటూనే కమలా సెల్వరాజ్ చేస్తున్న ఆరోపణలు మాత్రం ఖండిస్తోంది . మా అమ్మ కొన్ని విషయాలను ఎలా డీల్ చేయాలో తెలీక ఆర్ధిక ఇబ్బందులను కొని తెచ్చుకుందని అలాగే నమ్మినవాళ్లు మోసం చేయడంతో ఈ ఘోరం జరిగిందని అయినా ఇప్పుడు అనుకొని లాభం ఏముందని అంటోంది . జెమిని గణేశన్ కు మొత్తం ఎనిమిది మంది సంతానం కాగా అందులో ఏడుగురు అమ్మాయిలే ! అయితే మహానటి చిత్రం వల్ల వాళ్ళ లో డివిజన్ వచ్చేసింది . సావిత్రి పిల్లలు మహానటి కి అండగా నిలువగా జెమిని కూతుర్లు మాత్రం మహానటి చిత్రానికి యాంటీగా మాట్లాడుతున్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All