Homeటాప్ స్టోరీస్పిక్‌టాక్‌: స‌న్ ఫ్ల‌వ‌ర్ బికినీలో రౌడీ లేడీ!

పిక్‌టాక్‌: స‌న్ ఫ్ల‌వ‌ర్ బికినీలో రౌడీ లేడీ!

పిక్‌టాక్‌: స‌న్ ఫ్ల‌వ‌ర్ బికినీలో రౌడీ లేడీ!
పిక్‌టాక్‌: స‌న్ ఫ్ల‌వ‌ర్ బికినీలో రౌడీ లేడీ!

సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ `ఫైట‌ర్‌`. ఈ మూవీతో హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ బాలీవుడ్‌లోనూ ప్ర‌వేశించ‌నున్న విష‌యం తెలిసిందే. పూరి జ‌గ‌న్నాధ్‌, ఛార్మిల‌తో క‌లిసి బాలీవుడ్ పాపుల‌ర్‌ డైరెక్ట‌ర్ క‌మ్ ప్రొడ్యూస‌ర్ క‌ర‌ణ్‌జోహార్‌, అపూర్వ మెహ‌తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా తెలుగు తెర‌కు బాలీవుడ్ హీరోయిన్ అన‌న్య పాండే ప‌రిచ‌యం కాబోతోంది.

ముంబై వీధుల్లో ప‌లు ఛేజింగ్ సీన్‌ల‌తో పాటు బైక్ రైడింగ్ స‌న్నివేశాల్ని హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య పాండే పాల్గొన‌గా పూరి జ‌గ‌న్నాథ్ చిత్రీక‌రించారు. భారీ అంచ‌నాలతో ముంబైలో ప్రారంభ‌మైన ఈ మూవీ క‌రోనా నేప‌థ్యంలో లాక్‌డౌన్ కార‌ణంగా ఆగిపోయింది. ఇటీవ‌ల షూటింగ్‌లు పునః ప్రారంభ‌మైనా ఓ ఫైట‌ర్ కార‌ణంగా ఈ మూవీ షూటింగ్ ఆల‌స్యం అవుతోంది. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ ని తిరిగి ప్రారంభించ‌బోతున్నారు. ఇదిలా వుంటే ఈ చిత్రం ద్వారా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతున్న అన‌న్య పాండే పై తెలుగు ప్రేక్ష‌కులు ప్ర‌త్యేక దృష్టిని సారించారు.

- Advertisement -

దీంతో సోష‌ల్ మీడియాలో ‌అన‌న్య పాండే షేర్ చేస్తున్న ప్ర‌తీ ఫొటో వైర‌ల్‌గా మారుతోంది. తాజాగా 16 మిలియ‌న్‌ల మంది ఇప్ప‌టికే అన‌న్యన‌రి ఫాలో అవుతున్నారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు నెట్టింట సంద‌డి చేస్తున్నాయి. కుర్ర కారుని హీటెక్కిస్తున్నాయి. స‌న్ ఫ్ల‌వ‌ర్ బికినీలో లేలేత అందాల విందు చేస్తూ స్విమ్మింగ్ ఫూల్ నుంచి న‌డిచి వ‌స్తున్న అన‌న్య పాండే లుక్ ఆక‌ట్టుకుంటోంది. సోష‌ల్ మీడియాలోనే ఈ రేంజ్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న ఈ రౌడీ లేడీ `ఫైట‌ర్`‌లో విజ‌య్‌దేవ‌ర‌కొండ‌తో ఎంత ర‌చ్చ చేయ‌నుందో అని ఆమె ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Ananya ?? (@ananyapanday)

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All