దర్శకులు పూరి జగన్నాధ్ ని ఘోరంగా అవమానించారట ఫైట్ మాస్టర్ రాజు అలాగే అతడి అసిస్టెంట్ లు ఈ విషయాన్ని స్వయంగా దర్శకులు పూరి జగన్నాధ్ వెల్లడించడం విశేషం అయితే ఈ సంఘటన ఇప్పటిది కాదు సుమీ ! పూరి జగన్నాధ్ దర్శకుడు కాకముందు సంగతి . అప్పట్లో పూరి జగన్నాధ్ కృష్ణానగర్ లో ఉండేవాడు , ఆ ఇంటి ఓనర్ కు చౌదరి అనే మెస్ ఉండేదట దాంతో ఆ మెస్ లో ఖాళీగా ఉన్న సమయంలో భోజనాలు వడ్డించడానికి వెళ్లేవాడట ! అయితే ఆ సమయంలో ఫైట్ మాస్టర్ రాజు తో పాటుగా అతడి అసిస్టెంట్ లు భోజనానికి వచ్చేవాళ్లట ! వచ్చి ర్యాష్ గా ప్రవర్తించే వాళ్ళట .
ఇక పూరి జగన్నాధ్ ని అయితే ఘోరంగా అవమానించే వాళ్ళట ఫైట్ మాస్టర్ రాజు మనుషులు . అయితే వాళ్ళు ఎన్ని అవమానాలు చేసినా తట్టుకొని భరించాడట ఈ దర్శకుడు . కట్ చేస్తే పూరి జగన్నాధ్ కు మంచి రోజులు వచ్చాయి డైరెక్టర్ గా సూపర్ హిట్ లు సాధించాడు , తనకంటూ ఓ ప్రత్యేకత ని చాటుకున్నాడు . కానీ ఇప్పుడు మళ్ళీ సీన్ రివర్స్ అయ్యింది , వరుస ప్లాప్ లతో రేసులో లేకుండాపోయాడు పూరి . మళ్ళీ దర్శకుడిగా సత్తా చాటాలని భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నాడు మరి వర్కౌట్ అవుతుందో చూడాలి .
English Title: fight master raju and his assistants insults puri jagannadh