Homeటాప్ స్టోరీస్శివాజీరాజా మళ్ళీ గెలుస్తాడా ?

శివాజీరాజా మళ్ళీ గెలుస్తాడా ?

Fight between shivajiraja and naresh for MAA presidentమూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజా గత ఎన్నికల్లో పోటీ లేకుండా ఎన్నికయ్యాడు , అయితే ఈసారి మాత్రం సీనియర్ నటుడు నరేష్ తో శివాజీరాజా కు పోటీ తప్పకపోవచ్చు అని వినబడుతోంది . మార్చి 10 న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( మా ) ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల వేడి రాజుకుంది . గతంలో కూడా సాధారణ ఎన్నికలను తలపించింది మా ఎన్నికలు .

 

- Advertisement -

శివాజీరాజా మా కార్యవర్గంలో పుష్కర కాలానికి పైగా వివిధ హోదాలలో పనిచేసాడు , అంతేకాదు తన కార్యదీక్షత ఎలాంటిదో నిరూపించుకున్నాడు కూడా . అయితే గత ఏడాది మాత్రం శివాజీరాజా కు అలాగే సీనియర్ నటుడు నరేష్ కు విబేధాలు వచ్చాయి దాంతో రచ్చ రచ్చ అయ్యింది . అందుకే నరేష్ కూడా అధ్యక్షుడిగా పోటీ చేయాలనీ భావిస్తున్నాడు . నరేష్ కూడా పోటీ కి వస్తే తప్పకుండా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఎన్నికలు తప్పవు . ఎన్నికలు జరిగితే మళ్ళీ అందరి మెప్పు పొందుతాడా ? శివాజీరాజా  అధ్యక్షుడి గా గెలుస్తాడా ? చూడాలి .

English Title: Fight between shivajiraja and naresh for MAA president

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All