Homeటాప్ స్టోరీస్ఫిబ్ర‌వ‌రి 12న `ఫాద‌ర్ - చిట్టి - ఉమ - కార్తీక్‌`

ఫిబ్ర‌వ‌రి 12న `ఫాద‌ర్ – చిట్టి – ఉమ – కార్తీక్‌`

ఫిబ్ర‌వ‌రి 12న `ఫాద‌ర్ - చిట్టి - ఉమ - కార్తీక్‌`
ఫిబ్ర‌వ‌రి 12న `ఫాద‌ర్ – చిట్టి – ఉమ – కార్తీక్‌`

జ‌గ‌ప‌తిబాబు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం `ఫాద‌ర్ – చిట్టి – ఉమ – కార్తీక్‌`. యువ జంట‌గా రాహ్ కార్తీక్‌, అమ్ము అభిరామి న‌టిస్తున్నారు. మ‌రో ప్ర‌ధాన పాత్ర‌లో బేబీ స‌హ‌శ్రిత న‌టిస్తోంది. విద్యాసాగ‌ర్ రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శ్రీ‌రంజిత్ మూవీస్ బ్యాన‌ర్‌పై కె.ఎల్‌. దామోద‌ర‌ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర విడుద‌ల తేదీని చిత్ర బృందం సోమ‌వారం ప్ర‌క‌టించింది. విభిన్న‌మైన క‌థ‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 12న రిలీజ్ చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత కె.ఎల్‌. దామోద‌ర ప్ర‌సాద్ మాట్లాడుతూ `క‌రోనా మ‌హ‌మ్మారి ఇండ‌స్ట్రీని కోలుకోలేని దెబ్బ‌తీసింది. అయితే సోలో బ్ర‌తుకే సోబెట‌ర్‌, క్రాక్‌, రెడ్‌, అల్లుడు అదుర్స్ సినిమాల నిర్మాత‌లు ధైర్యం చేసి ధియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌డం, థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కులు ధైర్యంగా వ‌చ్చి స‌క్సెస్ చేయ‌డం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌కి ధైర్యాన్నిచ్చింది. ఈ విష‌యంలో నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు, హీరోలు, ప్రేక్ష‌కుల‌కు థ్యాంక్స్‌. టైటిల్ చూసి వేరే అర్థం వ‌స్తుంద‌ని కొంత మంది అంటున్నారు. వారంద‌రికీ ఒక విష‌యం చెబుతున్నా. శ్రీ‌రంజిత్ మూవీస్ ఎప్పుడూ ఎవ‌రూ త‌ల‌దించుకునే సినిమాలు తియ్య‌దు. సినిమా అనేది వ్యాపారమైన‌ప్ప‌టికీ కొన్ని విలువ‌ల‌తో సినిమాలు తీస్తూ వ‌స్తున్నాం. `ఎఫ్‌సీయూ` కూడా అలాంటి సినిమానే. గ‌త ఏడాది ఏప్రిల్లో రిలీజ్ చేయాల‌నుకున్నాం. కానీ పాండ‌మిక్ వ‌ల్ల రిలీజ్ వాయిదా వేశాం. ఇప్ప‌డు రిలీజ్ చేస్తున్నాం. ఫిబ్ర‌వ‌రి 12న ఈ చిత్రాన్ని రిల‌జ్ చేస్తున్నాం` అన్నారు.

- Advertisement -

జ‌గ‌ప‌తిబాబు మాట్లాడుతూ ` ద‌ర్శ‌కుడు విద్యాపాగ‌ర్ మంచి క‌న్విక్ష‌న్ వున్న ద‌ర్శ‌కుడు. సినిమాని చాలా బాగా తీశాడు. ఇందులో కార్తిక్ హీరో. నేనొక ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించాను. టీజ‌ర్ చూసిన వారంతా ఇది మీ క‌థ‌నా అని అడుగుతున్నారు. పిల్ల‌ల‌కు ఆట‌లు కావాలి. యూత్‌కు రొమాన్స్ కావాలి. మాకు అన్నీ కావాలి. ఇలా ఈ మూవీలో అన్నీ వున్నాయి` అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో హీరో రామ్ కార్తీక్‌, విద్యాసాగ‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All