Homeగాసిప్స్R.R.R సినిమా విషయంలో రాజమౌళికి శ్రమ తగ్గిస్తున్న ఫ్యాన్స్

R.R.R సినిమా విషయంలో రాజమౌళికి శ్రమ తగ్గిస్తున్న ఫ్యాన్స్

R.R.R సినిమా విషయంలో రాజమౌళికి శ్రమ తగ్గిస్తున్న ఫ్యాన్స్
R.R.R సినిమా విషయంలో రాజమౌళికి శ్రమ తగ్గిస్తున్న ఫ్యాన్స్

ఏదైనా ఒక సినిమా అనేది షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత రిలీజ్ చేసే లోపు ఆ సినిమా మీద హైప్ పోకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. కానీ కొన్ని సినిమాలు ఎందుకు మినహాయింపు. మణిరత్నం, శంకర్, రాజమౌళి లాంటి దర్శకులు సినిమాల షూటింగ్ విషయంలో చాలా ప్రైవసీ పాటిస్తారు. కథ గురించి నటీనటుల క్యారెక్టర్ల గురించి ఏ విషయం బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ముఖ్యంగా రాజమౌళి అయితే హీరోలని ఆ సినిమా ఎంతవరకు మరో సినిమాకు కూడా కమిట్ కాకుండా చూసుకుంటాడు. డీవీవీ దానయ్య నిర్మాతగా ఎస్.ఎస్.రాజమౌళి తీస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం R.R.R.ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి కథ ముందుగానే చెప్పేశాడు. ఎన్టీఆర్ పాత్ర “కొమరం భీమ్”ని పోలి ఉంటుందని అదేవిధంగా “రామ్ చరణ్ తేజ్”పాత్ర “అల్లూరి సీతారామరాజు”ను పోలి ఉంటుందని, సినిమా కథాంశం “మోటార్ సైకిల్ డైరీస్” ఒక హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో చేస్తున్నామని చెప్పాడు.

అయితే ఈ సినిమాకు సంబంధించి రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ మధ్య కొన్ని పోస్టర్లను విడుదల చేశారు. అవి ఎంత బాగున్నాయి అంటే నిజంగా సినిమా టీమ్ చేసినట్లు ఉన్నాయి. ఒక సినిమాని అభిమానులు ఇంత సీరియస్ గా తీసుకోవడం ఇదే మొదటిసారి. కన్నడ సినిమా ఇండస్ట్రీలో అయితే ఉపేంద్ర సినిమాలకు ఇలా అభిమానులు చేస్తూ ఉంటారు. ఉపేంద్ర 2 సినిమాకి అయితే, పోస్టర్లు ఫోటోలు, ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ తో సహా ఉపేంద్ర అభిమానులే చేసుకున్నారు. R.R.R సినిమాతో టాలీవుడ్ లో కూడా ఈ ట్రెండ్ మొదలైందని చెప్పవచ్చు. ఈ సినిమాలో అజయ్ దేవగన్ మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఒక మూడు మంచి విప్లవ గీతాలు ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజతో రాజమౌళి గారు రాయించినట్లు సమాచారం. విడుదల కు ముందే ఎన్నో సంచలనాలు సృష్టిస్తున్న ఈ సినిమా విడుదలయ్యాక మరిన్ని సంచలనాలు సృష్టించాలని కోరుకుందాం.

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All