Homeటాప్ స్టోరీస్హిందూ దేవుడి పేరు ఉంటే పాట కంపోజ్ చేయనన్న ఆ సంగీత దర్శకుడు ఎవరు?

హిందూ దేవుడి పేరు ఉంటే పాట కంపోజ్ చేయనన్న ఆ సంగీత దర్శకుడు ఎవరు?

Anantha Sriram comments on Music Director
Anantha Sriram comments on Music Director

జెనరేషన్ పరంగా మనం ఎంత ముందుకు వెళుతున్నా కూడా ఇంకా కుల, మత కట్టుబాట్లు ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. అయితే కులమతాల పట్టింపులు కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయనుకుంటే పొరబాటే. బాగా అభివృద్ధి చెందిన సిటీల్లో కూడా ఉన్నాయి. అయితే ఇలాంటి పట్టింపులు మనుషులకు ఉన్నా కళకు ఉండకూడదు. సినిమా అనేది ఒక కళ కాబట్టి అక్కడ అసలు ఉండకూడదు.

కులమతాలకతీతంగా కళకు సేవ చేసారు కాబట్టే ఇళయరాజా, ఏసుదాసు, మణిశర్మ లాంటి సంగీత కళాకారులు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. అవ్వడానికి ఒక సంగీత దర్శకుడు అయ్యుండి కూడా హిందూ దేవుడి పేరు ఉంటే బాణీ కట్టను అన్నాడట ఒక సంగీత దర్శకుడు.

- Advertisement -

అలీతో జాలీగా కార్యక్రమంలో ప్రముఖ పాటల రచయిత అనంత శ్రీరామ్ తనకెదురైన పై అనుభవాన్ని పంచుకున్నాడు. అప్పటినుండి ఆ సంగీత దర్శకుడితో ఇక పని చేయకూడదని నిర్ణయించుకున్నానని అన్నాడు శ్రీరామ్. ఇంతకీ ఆ సంగీత దర్శకుడెవరేనది మాత్రం చెప్పలేదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All