Homeటాప్ స్టోరీస్ఫలక్ నుమా దాస్ రివ్యూ

ఫలక్ నుమా దాస్ రివ్యూ

నటీనటులు : విశ్వక్ సేన్ , తరుణ్ భాస్కర్ , హర్షిత
సంగీతం : వివేక్ సాగర్
నిర్మాతలు : కరాటే రాజు , మనోజ్ , సందీప్
దర్శకత్వం : విశ్వక్ సేన్
రేటింగ్ : 2. 5/ 5
రిలీజ్ డేట్ : 31 మే 2019

- Advertisement -

 

టీజర్ , ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచేలా చేసిన విశ్వక్ సేన్ ఫలక్ నుమా దాస్ చిత్రాన్ని పూర్తి నమ్మకంతో ఒకరోజు ముందుగానే షో వేసాడు . మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే .

కథ :

దాస్ ( విశ్వక్ సేన్ ) ఫలక్ నుమా లో పుట్టి పెరిగినోడు , చిన్నప్పుడే శంకరన్న ని చూసి పెద్దయ్యాక నేను కూడా ఓ గ్యాంగ్ నడిపియ్యాలని అనుకుంటడు . అదే ఏరియాలో సఖి ని చూసి ప్రేమిస్తాడు . అయితే అనూహ్యంగా శంకరన్న ని ఓ గ్యాంగ్ చెంపేస్తుంది దాంతో శంకరన్న ని చంపిన వాళ్ళని పట్టుకొని పోలీసులకు అప్పగిస్తాడు దాస్ . ఇంతలో ఓ హత్య కేసులో దాస్ ని ఇరికిస్తారు , దాంతో ఆ కేసు నుండి బయట పడటానికి దాస్ ఏం చేసాడు ? కేసు నుండి బయట పడ్డాడా ? ఫలక్ నుమా దాస్ మాస్ కి దాస్ అనిపించుకున్నాడా ? లేదా ? తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

విశ్వక్ సేన్
తరుణ్ భాస్కర్
కామెడీ
నేచురల్ డైలాగ్స్

డ్రా బ్యాక్స్ :

సెకండాఫ్
స్క్రీన్ ప్లే

నటీనటుల ప్రతిభ :

విశ్వక్ సేన్ నటుడిగా హైలెట్ అయ్యాడు , డైలాగ్ డెలివరీ అలాగే చాలా సహజసిద్ధమైన వాడుక బాష ని ఎంచుకొని ప్రదర్శించిన హావభావాలు మెచ్చుకోతగినవే ! టాలీవుడ్ కి మరో నేచురల్ రైజింగ్ స్టార్ వచ్చాడు అనడంలో సందేహం లేదు . ఎమోషనల్ సీన్స్ లో అలాజె యాక్షన్ సీన్స్ లో ఎంటర్ టైన్ మెంట్ లో ఎక్కడా తగ్గలేదు విశ్వక్ సేన్ . పోలీస్ అధికారిగా దర్శకులు దాస్యం తరుణ్ భాస్కర్ కూడా మంచి రోల్ ప్లే చేసాడు . నేను దర్శకుడిని మాత్రమే కాదు నటుడిని కూడా అని నిరూపించుకున్నాడు . ఇంతకుముందు రెండు మూడు సినిమాల్లో నటించాడు తరుణ్ భాస్కర్ కానీ ఇందులో మాత్రం నటనకు అవకాశం ఉన్న పాత్ర లభించింది దాంతో సత్తా చాటాడు . హీరోయిన్ లు హర్షిత గౌర్ , సలోని గ్లామర్ తో పాటు నటనకు అవకాశం ఉన్న పాత్రలను పోషించారు .

సాంకేతిక వర్గం :

విశ్వక్ సేన్ కథకుడిగా , డైలాగ్ రచయితగా , దర్శకుడిగా , హీరోగా పలు పాత్రలు పోషించాడు . అయితే కథకుడిగా , డైలాగ్ రచయితగా , హీరోగా మాత్రం అద్భుతంగా రాణించాడు అనే చెప్పాలి . దర్శకుడిగా మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు . స్క్రీన్ ప్లే పరంగా సెకండాఫ్ లో జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది . సెకండాఫ్ కాస్తస్లోగా సాగడం మైనస్ అనే చెప్పాలి . నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి . వివేక్ సాగర్ అందించిన పాటలు , నేపథ్య సంగీతం ఈ సినిమాకు అదనపు ఆకర్షణ అయ్యింది . విజువల్స్ చాలా బాగున్నాయి .

ఓవరాల్ గా :

యూత్ కి నచ్చే మాస్ కి దాస్ ఫలక్ నుమా దాస్

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All