విక్టరీ వెంకటేష్ , వరుణ్‌తేజ్ హీరోలుగా నటించిన బ్లాక్ బస్టర్ `ఎఫ్2 `. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీ అనూహ్య విజయాన్ని సాధించింది. కలెక్షన్‌ల పరంగా ట్రేడ్ వర్గాలనే విస్మయానికి గురిచేసింది. ఫ్యామిలీ ఎమోషన్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని చిన్న పాటి సందేశాన్ని జోడించి అనిల్ రావిపూడి చేసిన ప్రయత్నం.. వెంకీ క్యారెక్టరైజేషన్ ఈ మూవీని బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలబెట్టాయి.
ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్ గా `ఎఫ్3`ని తెరకెక్కింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సీక్వెల్‌లో విక్టరీ వెంకటేష్, వరుణ్‌తేజ్ , తమన్నా , మెహ్రీన్ లు నటించగా..సునీల్ కీలక పాత్రలో నటించారు. మే 27 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో చిత్ర ప్రమోషన్ లను స్పీడ్ చేసారు. ఇప్పటికే చిత్రంలోని పలు సాంగ్స్ ను రిలీజ్ చేసి ఆకట్టుకున్న మేకర్స్..ఈరోజు చిత్రంలోని ‘ఊ ఆ అహ అహ’ అనే పాటను ఈరోజు శుక్రవారం విడుదల చేసారు. కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను సునిధి చౌహాన్ .. లవిత లోబో .. సాగర్ .. అభిషేక్ ఆపించారు. ప్రధానమైన జంటలపై చిత్రీకరించిన రొమాంటిక్ సాంగ్ ఇది.
ఈ పాటలో తమన్నా .. మెహ్రీన్ తో పాటు సోనాల్ కూడా మెరవడం విశేషం. మాస్ ఆడియన్స్ కోసం దేవిశ్రీ చేసిన ఈ ట్యూన్ వాళ్లకి కనెక్ట్ అయ్యేలానే ఉంది. అలాగే ఈ సినిమాలో పూజా హగ్దే ఐటెం సాంగ్ చేయడం విశేషం. భారీ తారాగణం తో రాబోతున్న ఈ మూవీ ఏ రేంజ్ లో విజయం సాధిస్తుందో చూడాలి. ఈ లోపు మీరు ఈ మాస్ సాంగ్ ను చూడండి.
