
పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం భీమ్లా నాయక్. ఈ మూవీ లో రానా విలన్ రోల్ లో నటిస్తుండగా ..పవన్ కు జోడిగా నిత్యా మీనన్ , రానా కు జోడి గా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. సాగర్ కే డైరెక్ట్ చేస్తుండగా…త్రివిక్రమ్ మాటలు , స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. షూటింగ్ అంత పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈ నెల 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమా తాలూకా విశేషాలు బయటకొస్తూ అంచనాలు పెంచేస్తున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ లో కొన్ని సీన్లను జోడించినట్లు తెలుస్తుంది.
ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకునే సరికి చిత్ర రన్ టైం మూడు గంటలు దాటిందట. దీంతో త్రివిక్రమ్ సూచనతో కొన్ని సన్నివేశాల్ని తొలగించారు. ఫైనల్ కాపీలో నిడివి కాస్త తగ్గడం వల్ల ఎడిటింగ్‌లో తొలగించిన కొన్ని సీన్లను తిరిగి జోడించబోతున్నారు. అందులో పవన్‌పై తెరకెక్కించిన ఓ పాట కూడా ఉందట. ఆ పాటను చిత్ర బృందం ఇప్పటి వరకు విడుదల చేయలేదు.
నేరుగా తెరపై చూపించాలన్న ఉద్దేశంతోనే అలా చేశారట. ఇటీవల లీకైన పవన్ కల్యాణ్ స్టిల్ ఆ పాటలోనిదేనని టాక్.ఇది కాకుండా పోలీస్ స్టేషన్‌లో చిత్రీకరించిన కొన్ని కామెడీ సీన్లను కలిపి మొత్తం 10 నుంచి 12 నిమిషాల నిడివి ఉన్న సీన్లను జోడిస్తున్నారని సమాచారం. మరి ఆ సీన్లు ఏ రేంజ్ లో ఉంటాయో తెలియాలంటే మరో వారం ఆగాల్సిందే.